హైదరాబాద్

వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 23: రాబోయే ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డి నాయకత్వంలో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించనునందని టీఆర్‌ఎస్ వికారాబాద్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి డాక్టర్ మెతుకు ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు బీ.సంజీవరావుతో కలిసి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. హైదరాబాద్‌కు వెళ్లి పూలమాల, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ధారూర్ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, జైదుపల్లి ఆనందం పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి మాజీ మంత్రి పీ.మహేందర్ రెడ్డితోనే సాధ్యమని న్యాయవాది, మాజీ ఎంపీపీ ఎం.రాంచందర్ రావు అన్నారు. ఆదివారం మహేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రం ఆవరణలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. దాదాపు 20 వాహనాల్లో దాదాపు 200 మంది హైదరాబాద్‌లోని మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి పూలమాల, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ జీ.నాగేందర్ గౌడ్, దశరథ్ గౌడ్, చైతన్య పాల్గొన్నారు.
శుభాకాంక్షలు వెల్లువ
రాజేంద్రనగర్: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మహేందర్ రెడ్డి నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం మధుసూదన్ రెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, బోయ రమేష్, సోను యాదవ్ పాల్గొన్నారు.
తాండూరు: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తాండూరు నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీ సంఖ్యలో హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి తరలివెళ్లారు. తాండూరు చేరుకొని స్థానిక మంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వాహనాలలో హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు.
తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో ముందస్తు ఎన్నికల వ్యూహరచనకు తాండూరులో మంత్రి నివాసం కేంద్ర బిందువుగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

రజకులకు నామినేటెడ్ పదవులు
బాలాపూర్, సెప్టెంబర్ 23: రజకులకు నామినేటెడ్ పదవులు వచ్చేలా కృషి చేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారని తెలంగాణ రజక యువ చైతన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేదవూరే బ్రహ్మయ్య పేర్కొన్నారు. రజకులను బీసీ జాబితా నుంచి ఎస్సీ జాబితాలో చేర్చే విషయంతో పాటు ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఏర్పాటు చేయించాలని, జనాభా ప్రాతిపదికన రజకులకు ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించే విధంగా తగిన చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహకు తెలియచేసి రజకులకు నామినేటెడ్ పదవులు వచ్చేలా కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీ.ఉమాపతి, బోడ్డుపల్లి మధు, పీ.శ్రీనివాస్, అంజి పాల్గొన్నారు.