హైదరాబాద్

2060 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనం, మొహర్రం ఊరేగింపులతో అదనంగా వచ్చిన 2060 మెట్రిక్ టన్నుల చెత్త, ఈనెల 21వ తేదీ మొహర్రం ప్రారంభమైన నాటి నుంచి, నిమజ్జనం రోజు వరకు మొత్తం 7100 మెట్రిక్ టన్నుల చెత్త పోగైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా నగరంలో వినాయక నిమజ్జన శోభయాత్ర ప్రధానంగా జరిగే బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సుమారు 18కిలోమీటర్ల రూట్‌లో ఎక్కువగా చెత్త పోగైనట్లు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 4500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, దాన్ని జీహెచ్‌ఎంసీ రౌండ్ ది క్లాక్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు, అక్కడి నుంచి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన రూట్ 18కిలోమీటర్లతో పాటు మొత్తం 370 కిలోమీటర్ల పొడువున శోభయాత్రలు జరిగాయి. దాదాపు 8600 మంది పారిశుద్ధ్య కార్మికులను జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, బషీర్‌బాగ్ తదితర మార్గాల్లో ఎక్కువ మండపాలు, వాటితోపాటు ఎక్కువ జనం రావటంతో పత్రి, పూలు వంటి చెత్తాచెదారం ఎక్కువగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిని ఎప్పటికపుడు సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ నియమించిన గణేష్ యాక్షన్ టీంలు రౌండ్ ది క్లాక్ పనిచేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వర్తించింది. ముఖ్యంగా నిమజ్జనం రోజున పదివేల మంది పారిశుద్ధ్య, ఎంటమాలజీ కార్మికులు ఎప్పటికపుడు శోభయాత్ర రూట్‌ను పరిశుభ్రం చేస్తూ, విశేషంగా కృషి చేశారని కమిషనర్ దాన కిషోర్ అభినందించారు.
35 ప్రాంతాలు..80వేల విగ్రహాలు
గ్రేటర్ పరిధిలోని 35 నిమజ్జన ప్రాంతాల్లో సుమారు 60వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అయినట్లు కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. ఒక్క హుస్సేన్‌సాగర్‌లోనే 15500 విగ్రహాలు నిమజ్జనమైనట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో ఏ విధమైన సమస్యల్లేకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని వివరించారు. రికార్డు స్థాయిలో 80వేల విగ్రహాల నిమజ్జనానికి, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ ఎంతో భేష్‌గా నిర్వహించామని తెలిపారు.
నిమజ్జన కొలనులకు పెరిగిన ఆదరణ
వినాయక విగ్రహాలను ఒకచోట నిమజ్జనం చేసేందుకు జీహెచ్‌ఎంసీ నిర్మించిన నిమజ్జన కొలనులను ఈసారి ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని కమిషనర్ తెలిపారు. ప్రత్యేకంగా నిర్మించిన 23 కొలనులో 34వేల 886 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
ప్రధానంగా నెక్నాంపురా చెరువు కొలనులో 3659 విగ్రహాలు, దుర్గం చెరువులో 3వేల 608, మల్కంచెరువులో 2584, రాజేంద్రనగర్ పత్తికుంట కొలనులో 2667, కూకట్‌పల్లి రంగదాముని చెరువులో 3214, కుత్బుల్లాపూర్ లింగం చెరువు కొలనులో 2012, అల్వాల్ కొత్త చెరువులో 2234 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

కోట్‌పల్లిలో టూరిజం అభివృద్ధి వేగవంతం
జిల్లాలోని కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాంతాలలో టూరిజం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో నిర్వహించిన టూరిజం అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోట్‌పల్లి, సర్పన్‌పల్లి తదితర ప్రాంతాలలో ఎకో టూరిజం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం కూర్చోడానికి, తినడానికి తగు షెడ్లు, దిమ్మెలను, తాగునీటి సదుపాయం, మినీ వాష్‌రూంలు (మరుగుదొడ్లు) ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువులలోని నీరు కలుషితం కాకుండా పెడల్ బోట్స్, రేయింగ్ బోట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. డీజిల్, పెట్రోల్‌తో నడిచే పెద్ద బోట్ల కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున బ్యాటరీలతో నడిచే బోట్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వారాంతపు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో 1500 నుంచి 2000 మంది పర్యాటకులు వికారాబాద్ జిల్లాను సందర్శిస్తున్నారని అన్నారు. నిర్వహణ కోసం కనీస రుసుము వసూలు చేయాలని వివరించారు.
పర్యాటక స్థలాలలో పరిశుభ్రత కోసం సిబ్బందిని నియమించాలని సూచించారు. రాబోయే రోజులలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నందున అన్ని హంగులతో పూర్తి సదుపాయాలతో అభివృద్ధిపర్చేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో పీడబ్ల్యూ జాన్సన్, సాగునీటి పారుదల ఈఈ చంద్రశేఖర్ రావు, అటవీ శాఖ జిల్లా అధికారి వేణుమాధవ రావు, మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.