హైదరాబాద్

ఇక ఈవీఎంల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుంచి ఊపందుకోనున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు ఓటరు జాబితా సవరణకు సంబంధించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, అంతకు ముందు గణేష్ నిమజ్జన ఏర్పాట్లతో బల్దియా అధికారులు బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే! మంగళవారంతో అభ్యంతరాల స్వీకరణకు ముగియటంతో ఇక బుధవారం నుంచి ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బంది నియామకం మొదలుకుని, ఈవీఎంల పంపిణీ, తిరిగి భద్రత పరిచే బాధ్యతల వరకు వివిధ ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేకంగా నోడల్ అధికారులను కమిషననర్ దాన కిషోర్ నియమించిన సంగతి తెలిసిందే! మంగళవారం వరకు పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటూ, తమ ఓటు ఉందా?లేదా? చూసుకునేందుకు వచ్చిన ఓటర్లకు సహకరించేవారు. బుధవారం నుంచి ఆ విధులు ఉండకపోవటంతో వారిని ప్రత్యామ్నాయంగా అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కారంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎక్కడైనా అదనంగా పోలింగ్ బూత్‌ల ఏర్పాటు చేయటం వంటి అదనపు బాధ్యతలను అప్పగించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో భద్రపరిచిన సరికొత్త అత్యాధునిక ఈవీఎంల పనితీరుపై బుధవారం నుంచి తొలి దశ తనిఖీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈవీఎంలను కమిషనర్ దాన కిషోర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. జిల్లా పరిధిలోని 3826 పోలింగ్ కేంద్రాలుండగా, 6వేల 120 బ్యాలెట్ యూనిట్లు, 4వేల 780 కంట్రోల్ యూనిట్లు, 5170 వీవీ ప్యాట్‌లను వివిధ రాజకీయపార్టీలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రతిరోజు కనీసం 700 ఈవీఎంలను తనిఖీ చేసే అవకాశముందని, ఈ ప్రక్రియ 20రోజుల పాటు కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈవీఎంల తనిఖీలను సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయటంతో పాటు హాజరయ్యే సిబ్బంది, అధికారులు, రాజకీయపార్టీల ప్రతినిధులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. వీటి తనిఖీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈవీఎంలను తనిఖీ చేసిన కమిషనర్‌తో పిటు అదనపు కమిషనర్ అద్వైత్‌కుమార్ సింగ్, సందీప్ జా, జాయింట్ కమిషనర్ పంకజ తదితరులున్నారు.