హైదరాబాద్

గ్రేటర్‌లో రియల్ భూమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకెళుతోంది. ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ, బహుళ జాతి కంపెనీల నుంచి పెట్టుబడులను ఆహ్వానించటం, రోజుల వ్యవధిలోనే అనుమతులిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో బడా సంస్థలు నగరంలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇందుకు అవసరమైన నిర్మాణ అనుమతుల వల్ల జిహెచ్‌ఎంసికి ఆదాయం కూడా పెరుగుతోంది.
గతంలో మూడు, నాలుగు నెలలకోసారి బిల్డింగ్ కమిటీ సమావేశం జరగటం వల్ల మందకొడిగా సాగిన భవన నిర్మాణ అనుమతులు జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వేగవంతం చేశారు. ఫలితంగా గడిచిన డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగున్నర నెలల వ్యవధిలో 24 ప్రధాన ప్రాజెక్టులకు నిర్మాణ అనుమతులను జారీ చేసి జిహెచ్‌ఎంసి రూ. 522 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు 5లక్షల 12వేల 742 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాజెక్టులకు, 8వేల 403 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల యూనిట్లకు కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అనుమతులు జారీ చేశారు. అంతేగాక, గడిచిన అయిదు నెలల్లో 17 ప్రధాన రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, ఏడు ప్రధాన కమర్షియల్ ప్రాజెక్టులకు కలిపి మొత్తం 5లక్షల 59వేల 760 చదరపు అడుగుల విస్తీర్ణానికి అధికారులు అనుమతులు జారీ చేశారు. వీటిలో ముఖ్యంగా గచ్చిబౌలీ, కూకట్‌పల్లి, మాల్కాజ్‌గిరిల్లో మూడు మల్టీ ప్లెక్స్ థియేటర్ మాల్స్, గచ్చిబౌలిలో బహుళ అంతస్తుల్లో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి భవనం, రాయదుర్గం, టోలీచౌకీ, నానక్‌రాంగూడలో నాలుగు కార్యాలయాల కాంప్లెక్సులు వంటి ముఖ్యమైన ప్రాజెక్టులున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి గాను బహుళ అంతస్తు భశనాల నుంచి వసూలు చేసే సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజును గణనీయంగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడం నగరంలో రియల్ బూమ్ ఊపందుకునేందుకు ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు.
అనుమతులు పెరిగాయిలా!
స్వరాష్ట్రం అవతరించిన తర్వాత నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలవుతుందన్న కొందరి అంచనాలను తారుమారు చేసే విధంగా జిహెచ్‌ఎంసికి ఇటీవల భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులొచ్చాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ అనుమతులకు గాను 9వేల 807 దరఖాస్తులు రాగా, వీటి ద్వారా రూ. 522 ఆదాయం సమకూరింది. 2014-15 సంవత్సరంలో 9వేల 331 భవన నిర్మాణ దరఖాస్తులు రాగా, వీటిని పరిశీలించి అనుమతులివ్వటంతో రూ. 506.17 కోట్ల ఆదాయం వచ్చింది. 2015-16లో వచ్చిన 9వేల 807 దరఖాస్తుల్లో 6884 దరఖాస్తులకు భవన నిర్మాణ అనుమతులిచ్చిన జిహెచ్‌ఎంసి మిగిలిన 1561దరఖాస్తులకు తగిన డాక్యుమెంట్లు లేకపోవటంతో తిరస్కరించింది. మరో 583 దరఖాస్తులు తిరస్కరించగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ల కోసం 2231 దరఖాస్తులు అందగా, 1350 దరఖాస్తులకు సర్ట్ఫికెట్లు జారీ చేసి, మరో 255 దరఖాస్తులను తిరస్కరించారు.