క్రైమ్/లీగల్

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, అక్టోబర్ 3: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేశ్ కథనం ప్రకారం.. నర్సాపూర్‌టౌన్, చైతన్యపురి కాలనీకి చెందిన వడ్ల గణేశ్ (21) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అదే కాలనీకి చెందిన ఎం.సాయి కుమార్ (21) బార్బర్ పని చేస్తాడు. అదే కాలనీకి చెందిన ఈశ్వరమ్మ (40) కూరగాయల వ్యాపారం చేస్తుంది. ముగ్గురు కలిసి దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడంది. నేరాన్ని అంగీకరించడంతో ముగ్గురిని రిమాండ్‌కు తరలించి వారి నుండి రూ.54,800ల విలువ చేసే బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పాత నేరస్థుడు అరెస్టు
కేపీహెచ్‌బీకాలనీ, అక్టోబర్ 3: వాహనాలను దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ సురేందర్ రావు వివరాలను వెల్లడించారు. బోరబండకు చెందిన పర్వేజ్‌ఖాన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. పర్వేజ్‌ఖాన్ జల్సాలకు అలవాటు పడిఆటో నడపడంతో వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలకు పాల్పడేవాడు. గతంలో రెండు సార్లు దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అతనిలో మార్పు రాకపోగా తిరిగి ఆటోలను, బైక్‌లను చోరిలకు పాల్పడుతున్నాడు. కూకట్‌పల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పర్వేజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన రెండు ఆటోలను, ఒక బైక్‌ను, మూడు మోటార్లు, 35 సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించార.