క్రైమ్/లీగల్

విద్యార్థి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, అక్టోబర్ 7: న్యాయవిద్య విద్యార్థి అదృశ్యమైన ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగామ ఎస్‌ఐ నర్సింహా రెడ్డి కథనం ప్రకారం మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సింబాయసిస్ యూనివర్సిటీలో న్యాయవిద్య మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.కుమార్ (20) అనే విద్యార్థి శనివారం సాయంత్రం యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లాడని, మళ్లీ రాలేదని, విద్యార్థి తండ్రి సంజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

వాహనం ఢీకొని ఒకరి మృతి
వికారాబాద్, అక్టోబర్ 7: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన చన్గొముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం రాత్రి వికారాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం- ఎనె్కపల్లి గేటు సమీపంలో స్కూటర్‌పై వెళుతున్న మైలార్‌దేవరంపల్లి గ్రామవాసి మహిపాల్ రెడ్డిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు.