హైదరాబాద్

90 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: గత ఎన్నికల్లో 90శాతం పోలింగ్ నమోదైన కేంద్రాలు, ఒకే అభ్యర్థికి 75శాతానికిపైగా ఓట్ల వచ్చిన కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాలని హైదరాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. బుధవారం జీహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసి కమిషనర్ దాన కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ అంజని కుమార్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు నమోదైన కేంద్రాలు, హింసాత్మక సంఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిన ప్రాంతాలను గుర్తించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున వివిధ పార్టీలు, అభ్యర్ధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలకు రిటర్నింగ్ అధికారిచే ముందస్తు అనుమతి తప్పని సరి అని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలకు ధరఖాస్తులను సంబంధిత పోలీస్ నోడల్ అధికారి అంగీకరించిన అనంతరమే అనుమతి ఇవ్వాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలు, ప్రతిక, మీడియా చానళ్లలో ప్రకటనలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలు తదితర అంశాలపై రాజకీయ పార్టీలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో రాజకీయ సభలు, సమావేశాలు, పాదయాత్రలు కొనసాగుతున్నాయని వాటిని వీడియో, ఫోటోలు తీసి ఆయా సభలు, సమావేశాల వ్యయాన్ని ఎన్నికల వ్యయంలో కలిపేందుకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పౌరసేవలపై ఎలాంటి నిషేదం లేదని, కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులపై మాత్రం ఎన్నికల నియమావళి ప్రకారం నిషేదం ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే రాజకీయ పార్టీలు సభ జరిగే ప్రదేశం, సమయం, ర్యాలీ నిర్వహించే మార్గాలు, ఎంత మంది హాజరు అవుతున్నారు అనే అంశాలను తప్పని సరిగా ధరఖాస్తుల్లో పేర్కొనాలని రాజీకయ పార్టీలకు సూచించారు. కాగా హైదరాబాద్ జిల్లా స్థాయి రాజకీయ పార్టీల సమావేశాన్ని ఈనెల 13న నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు.