హైదరాబాద్

నగరానికి పండుగ కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాఠశాలలకు సెలవులు, నవరాత్రి అమ్మవారి వేడుకలు జరుగుతుండటంతో భాగ్యనగరంలో పండుగా వాతావారణం నెలకొంది. దసరా వేడుకల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో ప్రతిష్టించిన అమ్మవారి మండపాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలు, యువతులు, చిన్నారులు నిర్వహిస్తున్న దాండియా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్‌తో పాటు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లు రద్దీగా మారాయి. తితిలీ తుపాన్‌తో ఉత్తారాంధ్ర ఒడిశా సరిహద్దులు పూర్తిగా దెబ్బతినడంతో దక్షిణ మధ్య రైల్వే పలురైళ్లను రద్దు చేసింది. భువనేశ్వర్, హౌరా వెళ్లే రైళ్లు చాలా వరకు విశాఖపట్నం వరకు పరిమితమయ్యాయి. రైల్వే ఉన్నాతాధికారులు రైలు సర్వీసులను పునరుద్ధరించినా రైళ్ల రాకపోకల్లో మాత్రం ఆలస్యం అవుతుండటంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు.. ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి పలు ప్రాంతాల నుంచి బస్సులను దూర ప్రాంతాలకు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) అధికారులు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఎల్‌బీనగర్, జేబీఎస్, ఉప్పల్, మియాపూర్, లింగంపల్లి, కాచిగూడ, రాజేంద్రనగర్-ఆరాంఘర్ చౌరస్తా, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి వంటి అనేక ప్రాంతాల నుండి బస్సులను వివిధ ప్రాంతాలకు నడువుతున్నారు. మహాత్మా గాంధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)తో పాటు నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జేబీఎస్ నుంచి ప్రతిరోజు దాదాపు 4500 బస్సులను నడుపుతుండగా, అదనంగా మరో వంద బస్సులను ప్రయాణికుల దృష్ట్యా నడుపుతోంది బెంగళూరు, ముంబయి, పుణె, కర్నాటక వైపు కూడా బస్సు సర్వీసులను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రతి నిత్యం 533 బస్సులను నడుపుతుండగా, ప్రయాణికుల సౌకార్యర్థం అదనంగా 110 బస్సులను అందుబాటులో ఉంచింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను టీఎస్‌ఆర్టీసీ బస్సులను శివారు ప్రాంతాల నుంచి నడుపుతోంది. దసరా, దీపావళి పండగలకు అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలు బస్సులతో రద్దీగా మారుతాయి.
కళకళాడుతున్న షాపులు
దసర పండుగ సందర్భంగా షాపింగ్ మాల్స్, బట్టల షాప్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. కోఠి, ఆబిడ్స్, హిమయత్‌నగర్, చార్మినార్, దిలుసుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని షాప్‌లు కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రోడ్లన్ని వాహనాలతో రద్దీగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి.