హైదరాబాద్

బతుకమ్మ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో గల్లీగల్లీలోనూ అమ్మవారి మండపాలు, నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈనెల 17న నగరంలోని ఎల్‌బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌పై భారీ ఎత్తున నిర్వహించనున్న బతుకమ్మ పండుగకు బల్దియా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు అమ్మవారి మండపాల వద్ద ప్రతి రోజు సాయంత్రం స్థానిక మహిళలు, స్వయం సహాయక బృందాల మహిళలు బతుకమ్మ ఆడుతూ ఆకట్టుకుంటున్నారు. శివార్లలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుని మరీ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎల్‌బీ స్టేడియంలో గతంలోనే లక్ష మందితో బతుకమ్మ వేడుకను నిర్వహించి, అరుదైన గిన్నిస్ రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. స్ఫూర్తితో ఈసారి కూడా బతుకమ్మ పండుగను మరింత ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ట్యాంక్‌బండ్ ఎంట్రెన్స్ మొదలుకుని నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు కూడళ్లు, చౌరస్తాలను రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా తీర్చిదిద్దింది. మరికొన్ని చోట్ల బతుకమ్మ నమూనాలను ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసింది. సుమారు మూడు అడుగుల ఎత్తు నుంచి ఏకంగా పదిహేను, ఇరవై అడుగుల ఎత్తు వరకు కూడా బతుకమ్మ నమూనాలను రంగురంగులతో ఏర్పాటు చేశారు. వీటిని జనసంచారం ఎక్కువగా ఉండే ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్‌ప్లాజా, ఖైరతాబాద్ చౌరస్తా వంటి రద్దీ కూడళ్లను ఎంపిక చేసి మరీ ఏర్పాటు చేశారు. నగరంలోని స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో ఈనెల 17వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో బతుకమ్మ పండుగను నిర్వహించి, అక్కడి నుంచి మహిళలు ఊరేగింపుగా వచ్చి హుస్సేన్‌సాగర్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఎల్‌బీ స్టేడియం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు రూట్‌లో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.