హైదరాబాద్

గల్లీగల్లీలో బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఆటాపాట నగరంలోని గల్లీగల్లీలో ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన అమ్మవారి మండపాల వద్ద మహిళలు, యువతులు సాంప్రదాయ వస్త్రాలంకరణలో బతుకమ్మ ఆడుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. సోమవారం జలమండలి ఆఫీసులో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా ఉద్యోగులు పూలతో బతుకమ్మను పేర్చి, ఆడి, పాడి ఆనందంగా గడిపారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంగళవారం మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టు దాదాపు గంటల పాటు తెలంగాణ పాట పాడుతూ, ఆట ఆడుతూ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న మహిళలు ఆ తర్వాత సమీపంలోని చెరువులు, కుంటలు, బావుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను అందమైన, రంగురంగుల లైట్లతో ముస్తాబు చేశారు. ముఖ్యంగా ప్రత్యేక విద్యుత్ లైట్లతో తయారు చేసిన బతుకమ్మలు హుస్సేన్‌సాగర్‌లో చెరువులో రంగురంగుల వెలుగులను జమ్మితూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంటు అంబేద్కర్ విగ్రహం నుంచి వైస్రాయ్ హోటల్ ముందున్న ఎంట్రెన్స్ వరకు జనాన్ని ఆకట్టుకునే తరహాలో లైటింగ్ చేయటంతో పాటు భారీ ఎల్‌ఈడీలను ఏర్పాటు చేసి, తెలంగాణ ఆటాపాటలను ప్రదర్శిస్తున్నారు. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ అటు ఐమాక్స్ నుంచి ఎంతో ఆకర్షణీయంగా కన్పిస్తోంది. అలాగే ఐమాక్స్ వైపు ఏర్పాటు చేసిన లైటింగ్ ట్యాంక్‌బండ్ నుంచి మరింత అందంగా దర్శనమిస్తోంది. దీంతో అప్పర్‌ట్యాంక్‌బండ్, ఐమాక్స్ రూట్‌లో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, పాదచారులు సైతం కాసేపు ఆగి, ట్యాంక్‌బండ్ అందాలను వీక్షిస్తున్నారు. సాగర్‌లో బుద్ధుడి ముందు ఏర్పాటు చేసిన లైట్ల బతుకమ్మలను మహిళలు, చిన్నారులు ఎంతో ఆసక్తితో తిలకిస్తున్నారు. ఇక ప్రత్యేక లైట్లతో వెలిగిపోతున్న బుద్ధుడి విగ్రహాం, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్, భారీ ఎల్‌ఈడీల వద్ద జనం సెల్ఫీలు దిగేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఎల్‌ఈడీల్లో ప్రదర్శిస్తున్న తెలంగాణ ఆటాపాటలను వాహనదారులు ఎంతో ఆసక్తితో తిలకిస్తున్నారు.