హైదరాబాద్

ఆన్‌లైన్‌లోనూ ఎన్నికల ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సీ-విజిల్’ అంటే?
సీ-విజిల్ అంటే ఎన్నికల్లో భాగంగా కోడ్ అమల్లో ఉన్నపుడు ఎక్కడైనా కోడ్‌ను ఉల్లంఘిస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, వస్తువులను పంపిణీ చేసినట్లు ప్రజలు గుర్తిస్తే, వారు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి పంపేందుకు ‘సీ-విజిల్’ ప్రొవిజన్ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు.
*
హైదరాబాద్: త్వరలో జరగనున్న ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులు తమ సౌకర్యాన్ని బట్టి కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఈ-సువిధ’ను అనుసరించి తమ ఫిర్యాదులు, దరఖాస్తులు ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ రాజకీయపార్టీలు, ప్రతినిధులు సహకరించాలని సూచించారు. సోమవారం ఆయన వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ప్రజలు గుర్తించినట్లయితే, వారు ‘సీ-విజిల్’ విధానంలో ప్రజలు తమకు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ఇటీవలే జారీ చేసిన ఓటరు తుది జాబితాకు సంబంధించి చేర్చి ఓట్లు, తొలగించిన ఓట్లతో పాటు మొత్తం సమాచారాన్ని అన్ని పార్టీల ప్రతినిధులకు పంపినట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు, నిబంధనలు పాటించటంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, అభ్యర్థులకు ఎన్నికల సిబ్బంది, అధికారులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల్లో కీలకమైన విధులు నిర్వర్తించే బూత్ లెవెల్ అధికారులకు సహకారంగా అన్ని పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, వీరు సమన్వయంతో పనిచేసేందుకు వీలుగా వీరి మధ్య ఇంటరాక్షన్ నిర్వహించాలని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయనున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని, అది 48 గంటల ముందు తమకు వివరాలు సమర్పిస్తే, ఇరవై నాలుగు గంటల ముందు ఆర్‌ఓ అనుమతులు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటికే నియమితులైన ఆర్‌ఓల్లో కొందర్ని ఎన్నికల సంఘం బదిలీ చేయటంతో ఏర్పడిన ఖాళీల్లో ఈ నెల 17లోపు కొత్త ఆర్‌ఓలను నియమించనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం మొత్తం 23వేల మంది సిబ్బంది అవసరమని, ఇప్పటికే పలు శాఖలను సంప్రదిస్తున్నట్లు, నియామక ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే పూర్తవుతుందని కమిషనర్ వివరించారు.