హైదరాబాద్

జీతాల కోసం నర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: గాంధీ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా ఔట్ సోర్సింగ్ నర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా కాంట్రాక్టర్ జీతాలు చెల్లించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగులు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు తరుచూ దాపురిస్తున్నాయి. అత్యవసర విభాగం అయిన మెడికల్ విభాగంలో సైతం ప్రభుత్వం జీతాలు చెల్లించడంలో చేస్తున్న జాప్యం కారణంగా ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందని సీఐటీయు నాయకులు నర్సింహ పేర్కొన్నారు. ప్రతిసారి చదువుని అరకొర జీతాలకు పనిచేస్తున్నప్పటికి వారికి అందాల్సిన జీతాలను సకాలంలో ఇవ్వకుండా నెలల తరబడి కాంట్రాక్టర్ జాప్యం చేస్తుండడంతో తరుచూ ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సమయంలో ఉద్యోగులు పస్తులు ఉండాల్సి వచ్చిందని, సోమవారం నర్సింగ్ ఉద్యోగులు బతుకమ్మ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, అధికారులు స్పందించి తమకు న్యాయంగా అందాల్సిన జీతాలను సకాలంలో అందించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్, అధికారులు ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సీఐటీయు నాయకులు నర్సింహ హెచ్చరించారు.