క్రైమ్/లీగల్

నాలాలో కొట్టుకుపోయ వ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: మహానగరంలో మంగళవారం ఆకస్మికంగా కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో దాదాపు అరగంటసేపు వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన మహానగరవాసులు ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో కాస్త ఊరట చెందారు. కానీ ఆకస్మికంగా వర్షం కురవటంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు రహదారులు జలమయమై కాసేపు వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైన వర్షం తొలుత ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో కురిసి, ఆ తర్వాత సికిందరాబాద్ ప్యాట్నీ, బాటా, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో దంచికొట్టింది. ఆ తర్వాత అరగంటకు మోస్తరు కుండపోతగా కురవటంతో సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని వ్యాపార సంస్థల్లోకి, సెల్లార్లలోకి వర్షం నీరు భారీగా చేరింది.
బోరబండలోని సాయిబాబా గుడి వద్ద రహదారులన్నీ జలమయం కావటంతో ఓ వ్యక్తి కాలువలో పడి కొట్టుకుపోయాడు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ వెంటనే జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యు ఫోర్సుకు సమాచారం అందించారు. రంగంలో దిగిన డీఆర్‌ఎఫ్ బృందం కాలువలో పడి కొట్టుకుపోయిన వ్యక్తిని కేవలం ఇరవై నిమిషాల్లో గుర్తించి, బయటకు తీసింది. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడు మూసాపేట రామారావునగర్‌కు చెందిన రాజయ్యగా గుర్తించారు. జలమయమైన రోడ్లపై నీటిని తోడే పనులు అర్థరాత్రి వరకు కొనసాగాయి.