హైదరాబాద్

అనంత్ నారాయణ్‌రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆనంద్‌నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత్ నారాయణ్‌రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషులు, మహిళల సింగిల్స్ ట్రోఫీలను జీటీటీఏకు చెందిన ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్, ఆర్‌బీఐకి చెందిన నిఖత్‌భాను కైవసం చేసుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ ప్లేగ్రౌండ్‌లో అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 4-2 స్కోరు తేడాతో ప్రత్యర్థి ఎల్‌బీఎస్‌కు చెందిన మహ్మద్ అలీపై, మహిళల సింగిల్స్‌లో నిఖత్ బాణు 4-1తో హెచ్‌వీఎస్‌కు చెందిన జీ.ప్రణితపై గెలుపొంది టైటిల్‌ను సోంతం చేసుకుంది. యూత్ ఫైనల్లో భాగంగా జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో జీఎస్‌ఎంకు చెందిన వరుణి జైస్వాల్ 4-0 తేడాతో హెచ్‌వీఎస్‌కు చెందిన ప్రణితపై, బాలురలో స్నేహిత్ 4-0తో ఆరవింద్‌పై విజయం సాధించి ట్రోఫిలను గెలుచుకున్నారు. జూనియర్ బాలబాలికల సింగిల్స్‌లో జరిగిన ఫైనల్లో జీటీటీఏకు చెందిన బీ.వరుణ్ శంకర్, జీఎస్‌ఎంకు చెందిన ఎన్.్భవితలు గెలుపొందారు. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరుణ్ శంకర్ 4-1 స్కోరు తేడాతో ప్రత్యర్థి అమాన్ ఉర్ రెహమాన్‌పై, బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో భవిత 4-3 తేడాతో వీ.లాస్యపై నెగ్గారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్సీ రామచందర్‌రావు విచ్చేసి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రంలో బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్, తెంలగాణ టెబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు ఎ.నర్సింహ్మరెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే.మహేశ్వరి, కార్యదర్శి పీ.ప్రకాష్‌రాజ్, హైదరాబాద్ జిల్లా టీటీ సంఘం కార్యదర్శి మహ్మద్ ఇబ్రహీంఖాన్, నిర్వహణ కార్యదర్శి ఎ.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమే
కేశంపేట, అక్టోబర్ 16: క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా భావిస్తూ ముందుకు వెళ్లినప్పుడే విజయం సాధించగలమని తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం కేశంపేటలో భజరంగ్‌దళ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయుల గ్రామీణ క్రీడ కబడ్డి అని, ఈ క్రీడపట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. గెలుపు, ఓటములను సమానంగా భావిస్తూ విజయం దిశగా క్రీడాకారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విజయమే లక్ష్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలుంటుందని అన్నారు. విద్యతోపాటు క్రీడల్లో రాణించేందుకు యువత కృషి చేయాలని సూచించారు.

అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నీ చాంప్ కొత్తగూడెం, మెదక్
హైదరాబాద్, అక్టోబర్ 16: హైదరాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మినీ సబ్ జూనియర్ బాలబాలికల చాంపియన్‌షిప్‌లో మెదక్, కొత్తగూడెం జట్లు విజేతగా నిలిచాయి. సికింద్రాబాద్‌లోని పీజీ కాలేజీలో జరిగిన ఈ టోర్నీలో బాలికల ఫైనల్ మ్యాచ్‌లో మెదక్ 4-3 పరుగుల తేడాతో నిజామాబాద్‌పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో నిర్మల్ 13-8 పరుగుల తేడాతో ప్రత్యర్థి అదిలాబాద్‌పై గెలుపొందింది. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్లో కోత్తగూడం జట్టు 1-0తో నిజామాబాద్‌పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మెదక్ 3-1 తేడాతో వరంగల్‌పై నెగ్గింది.

జగద్గిరిగుట్ట పీఎస్‌లో ఓపెన్ హౌజ్
జీడిమెట్ల, అక్టోబర్ 16: జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఓపెన్ హౌజ్ నిర్వహించారు. పీఎస్ పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సీఐ కావెటి శ్రీనివాసులు, డీఐ సుమన్ పోలీసుల విధుల, ఆయుధాల పనితీరు, వాడకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై కృష్ణ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కే టిక్కెట్ కేటాయించాలి
ఉప్పల్, అక్టోబర్ 16: చిల్కానగర్ డివిజన్‌లో మంగళవారం కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను పార్టీ ఇంచార్జి రాగిడి లక్ష్మా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి ప్రారంభించారు. సుమారు 200 మందితో ర్యాలీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, ఉప్పల్ అసెంబ్లీ టిక్కెట్‌ను కాంగ్రెస్‌కు కేటాయిస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శక్తి యాప్ కోఆర్డినేటర్ గంట సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు టీ.రాజ్యలక్ష్మి, సుధాకర్ శెట్టి, రాజేష్, ఎండీ అనీఫ్, ఎండీ.షఫీ, రఫిక్, బీ.రమేశ్, వేణు, సంతోష్, భాను, రవీందర్, మల్లిఖార్జున్, కరుణాకర్ రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.