హైదరాబాద్

నియోజకవర్గానికి ఐదు నిఘా వ్యవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ముందస్తు ఎన్నికల్లో ఎన్నికల నియమావళి (ఎంసీసీ)ను పకడ్బందీగా అమలు చేస్తూ, ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోడ్ అమలును ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు, ఉల్లంఘించిన వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. మంగళవారం ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేసే అంశంపై ఎన్నికల విధుల నిమిత్తం నియమితులైన ప్రతి అధికారి, సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గానికి ఏర్పాటు చేయనున్న ఐదు రకాల నిఘా వ్యవస్థల్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, వీడియో సర్వైలెన్స్ టీంలు, వీడియో వ్యూయింగ్ టీము, అకౌంటింగ్ టీంలను ఏర్పాటు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు, అంతకంటే ఎక్కువగా ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, వీడియో సర్వైలెన్స్ టీంలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఒక సీనియర్ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేటు ఆధ్వర్యంలో పనిచేసే ఫ్లయింగ్ స్క్వాడ్‌లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి, ఒక వీడియోగ్రాఫర్, ముగ్గురు లేక నలుగురు సాయుధ పోలీసులు ఉంటారని ఆయన వివరించారు. ప్రతి స్టాటిక్ సర్వైలెన్స్ టీంలో ఒక మేజిస్ట్రేటు, ముగ్గురు నుంచి నలుగురు పోలీసులు, వీడియో సర్వైలెన్స్ టీంలో ఒక అధికారి, ఒక వీడియో గ్రాఫర్ ఉంటారని కమిషనర్ పేర్కొన్నారు. ఈ మూడు బృందాలను వెంటనే ఎర్పాటుచేసి వాటి వివరాలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారిగా ఉన్న హైదరాబాద్ జాయింట్ కలెక్టర్‌కు సమర్పించాలని ఆర్‌ఓలను ఆదేశించారు. దీంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఒక అధికారి, ఇద్దరు క్లర్క్‌లతో కూడిన వీడియో వ్యూయింగ్ టీంలను, ఒక అధికారి, ఒక క్లర్క్ సభ్యులుగా ఉన్న అకౌంటింగ్ టీంలను వెంటనే నియమించి వారి వివరాలను కూడా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారిగా ఉన్న జీహెచ్‌ఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్‌కు సమర్పించాలని ఆదేశించారు.

రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్‌గా ప్రదీప్ కుమార్
రాజేంద్రనగర్, అక్టోబర్ 16: రాజేంద్రనగర్ సర్కిల్ నూతన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా ప్రదీప్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

సమతుల్య ఆహారంతో ఆరోగ్యం
* ఆయూష్ మాజీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి
ఖైరతాబాద్, అక్టోబర్ 16: సంపూర్ణమైన ఆరోగ్యానికి సమతుల ఆహారంతో ఎంతో ముఖ్యమని ఆయూష్ మాజీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని పంజాగుట్టలోని ఓ హోటల్‌లో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధులుగా రాజేందర్ రెడ్డి, న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి, కేఎల్‌సీపీ ఎండీ డాక్టర్ సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పండ్లు, ఫలాలను ఒక క్రమపద్ధతిలో తీసుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. అధునికత పేరుతో ఆహార నియమాలను మరిచి ఇష్టానుసారం వ్యవహరిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.
మోతాదుకు మించి క్రిమిసంహారక మందులను వాడుతూ పండిస్తున్న పంటల వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వేల ఏళ్లక్రితమే ఆయుర్వేదం ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలని సూచించిందన్నారు. మోతాదుకు మించి తీసుకుంటున్న ఆహారం విషంలా మారి ఊబకాయానికి తద్వారా వ్యాధులకు కారణం అవుతుందని అన్నారు.

పిడుగు పాటుకు యువకుడి మృతి
మర్పల్లి, అక్టోబర్ 16: పిడుగు పాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన మర్పల్లి మండలంలో కొత్లాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కొత్లాపూర్ గ్రామానికి చెందిన రంజోల్ ప్రశాంత్(18) అనే యువకుడు ఎద్దులను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో మార్గమధ్యలో చింత చెట్టు కిందికి వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు.