హైదరాబాద్

గోడ కూలి విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, అక్టోబర్ 17: పాత ఇల్లు కూల్చి నూతన భవనం నిర్మించటంకోసం చేపట్టిన తవ్వకాలతో గోడ కూలి పక్కింట్లోని విద్యార్థినిపై పడటంతో తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందిన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ఆనందకిశోర్ కథనం ప్రకారం.. న్యూ బోయిన్‌పల్లి కంసీరిబజార్ నివాసి అరుణ్‌కుమార్ యాదవ్, స్వర్ణలత కూతురు ఇంటర్ చదువుతుంది. ఇంట్లో వంట పని చేస్తుండగా, అదే సమయంలో పక్కింటి యజమాని మల్లేష్ యాదవ్ తన పాత ఇంటిని పడగొట్టడానికి బుధవారం జేసీబీతో కూల్చివేత పనులు ప్రారంభించాడు. గోడలు కూల్చే క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో గోడ కూలి పక్కింటిపై పడడంతో వంట చేస్తున్న హర్షితపై పడటంతో తీవ్ర గాయాలైనాయి. ఇరుగు పొరుగు వచ్చి శిథిలాల కింద పడిన యువతిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు డాక్టర్లు ధుృవీకరించారు. బోయిన్‌పల్లి సీఐ ఆనందకిషోర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత అదృశ్యం
మేడ్చల్, అక్టోబర్ 17: వివాహిత అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాజబొల్లారం తండాకు చెందిన కే.రామస్వామి భార్య కే.అనురాధ ఈ నెల 16న అదృశ్యమైంది. ఫోన్ ఛాటింగ్ విషయంలో భర్తతో గొడవపడి అనురాధ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని అనురాధ తల్లి స్వరూపకు అల్లుడు రామస్వామి వివరించాడు. హుటహుటిన స్వరూప తన భర్తతో కలిసి రాజబొల్లారానికి చేరుకుంది. అనురాధ ఆచూకీ కోసం వాకబు చేసినా ఎటువంటి లాభం లేకపోయింది. బుధవారం మేడ్చల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.