హైదరాబాద్

సికింద్రాబాద్ స్టేషన్‌లో అధునాతన ఫుడ్ ప్లాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రోజూ వేలాది మంది సికింద్రాబాద్ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళుతున్న రైల్వే ప్రయాణీకుల కోసం దక్షణ మధ్య రైల్వేలో ఆధ్వర్యంలో వివిధ రకాల రుచికరమైన భోజనాలు తినవచ్చు, తీసుకుపోచ్చును అంటూ రైల్వే సరికొత్త ప్రయోగానికి సిద్ధం అయ్యింది. తెలుగువారు ఇష్టపడే వంటకాలు సైతం ఉంటాయని అన్నారు. ఈ ఆహార సౌకార్యలు ప్లాట్‌ఫామ్ ఒకటిలో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆధునాతనంగా ఫుడ్ ప్లాజాను ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ సంయుక్తంగా ప్రయాణీకులను ఆకర్శించడానికి సబ్సిడీతో తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తున్నారు.
మూడు రకాల పేర్లతో పిలువబడే వంటకాల రుచులను తయారు చేస్తున్నారు. ఫుడ్‌ప్లాజా, ఫుడ్‌ట్రాక్, ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేశారు. ఫుడ్‌ప్లాజాలో తయారు చేస్తున్న వివిధ రకాల వంటకాలు ఎలా ఉన్నాయోనని దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఫుడ్ ప్లాజాను బుధవారం సందర్శించారు. వంటకాలకు సంబంధించిన మెను పట్టికను ఆయన పరిశీలించారు. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలని, అలా లేకపోతే బయట ఫుడ్‌పై ప్రయాణీకులు ఇష్టపడతారని అన్నారు. ఫుడ్‌ప్లాజాను పర్యవేక్షించడానికి హెచ్‌ఎంఎస్ హోస్టు ప్రైవేట్ సర్వీస్‌ను రైల్వేశాఖ నియమించింది. సికింద్రాబాద్ స్టేషన్ ఒకటవ అంతస్తులో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. ఫుడ్‌ప్లాజాలో కేఎఫ్‌సీకి సంబంధించిన ఐటమ్‌లు కూడా ఉంటాయని రైల్వేశాఖ సీపీఆర్‌వో ఉమాశంకర్ తెలిపారు.

టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో మేడ్చల్‌కు పూర్వవైభవంగా కల్పించాలి
మేడ్చల్, అక్టోబర్ 17: రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మేనీఫెస్టోలో చారిత్మ్రాకమైన మేడ్చల్ ప్రాంతానికి పూర్వవైభవం కల్పించాలని మేడ్చల్ జిల్లా సాధన సమితి నేత పీ. సుధాకర్ రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రణాళిక చైర్మన్ కే.కేశవ రావు.. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి.. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామికు కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు మండలాలకు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నెలకొల్పాలని విన్నవించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్‌కు, ఉప్పల్ నుండి ఘట్‌కేసర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని పత్రంలో పేర్కొన్నారు.

సాహితీవేత్తలకు వేదగిరి రచనలు స్ఫూర్తి
కాచిగూడ, అక్టోబర్ 17: సుప్రసిద్ధ రచయిత డా.వేదగిరి రాంబాబు రచనలు నేటితరం సాహితీవేత్తలకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అన్నారు. వేదగిరి రాంబాబు సాహిత్య చైనత్యం అంశంపై ప్రసంగ కార్యక్రమం ఎంవీ ఆర్ ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్తలు సుధామ, విహారి, డా.కేబీ లక్ష్మీ, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, పాల్గొని వేదగిరి రాంబాబు చిత్ర పటానికి నివాళి అర్పించారు. వేదగిరి రాంబాబు అనేక అంశంలపై పరిశోధనలు చేసి అన్ని ప్రక్రియాల్లో రచనలు చేశారని తెలిపారు. పరిశోధనా సాహిత్యంపై నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.