హైదరాబాద్

గ్రేటర్‌లో టీడీపీకి 9 సీట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు ఏర్పాటైన ప్రజాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి తొమ్మిది సీట్లు దక్కే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నగరంలోని రెండో స్థానంలో నిలిచిన స్థానాలను తమకే కేటాయించాలన్న ప్రాతిపదికన సీట్లను సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలున్న కోర్ సిటీలో టీడీపీ పార్టీకి పాతబస్తీలోని మలక్‌పేట, చార్మినార్, సికిందరాబాద్, ఖైరతాబాద్ స్థానాలతో పాటు ముషీరాబాద్, కంటోనె్మంట్ స్థానాల్లో ఒకటితో కలిపి ఐదు స్థానాలను కేటాయించే దిశగా ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక మిగిలిన స్థానాల్లో జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేయాలని ప్రజాకూటమి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక శివార్లలోని తొమ్మిది స్థానాల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశముండగా, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి స్థానాలను టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే మహాకూటమిలోని పార్టీలకు చెందిన అదినాయకులు సూచనప్రాయంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో ఇప్పటికే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు, ఖైరతాబాద్ తెలుగు యువత నేత లంకెల దీపక్‌రెడ్డి, సికిందరాబాద్ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ముషీరాబాద్ సీటును కాంగ్రెస్‌కు వదిలేయాలని ఆ పార్టీ నేతలు టీడీపీ నేతలకు సూచిస్తున్నట్లు సమాచారం. కానీ ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావుకు ఈ సారి అవకాశం ఇవ్వాల్సిందేనని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కంటోనె్మంట్ స్థానాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనపై కూడా తర్జనభర్జన జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగర టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారిస్తున్న ఎంఎన్. శ్రీనివాస్ రావు.. ఎస్సీ సామాజికవర్గానికి చెంది ఉండటంతో ఎస్సీలకు రిజర్వు చేసిన కంటోనె్మంట్ నుంచి బరిలో దింపాలని కాంగ్రెస్ సూచించినా, టీడీపీ అంగీకరించటం లేదనే చర్చ లేకపోలేదు.
టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఖైరతాబాద్
అధికార టీఆర్‌ఎస్‌కు ఈసారి ఖైరతాబాద్ టికెట్ కేటాయింపు తలనొప్పిగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కనీసం జై తెలంగాణ అనే నినాదం కూడా చేయని మాజీ మంత్రి దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి, టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థులపై దాడులు చేయించిన దానం నాగేందర్‌కు టికెట్ కేటాయిస్తే తాము పనిచేసేందుకు సిద్ధంగా లేమని ఇప్పటికే ఖైరతాబాద్ శ్రేణులు అధిష్ఠానానికి తెల్చిచెప్పినట్లు సమాచారం. చివరి నిమిషంలో నాగేందర్‌ను బరిలో దింపితే, ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారు ఓ నిర్ణయానికి వచ్చి, వారిలో ఒకరు స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగుతామని కూడా స్పష్టం చేయటంతో ఈ సీటు కేటాయింపుపై అధిష్ఠానం తలపట్టుకోవల్సిన పరిస్థితి తలెత్తింది.