రంగారెడ్డి

మందిరాల వద్ద నిరంతర పికెటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, అక్టోబర్ 19: నిరంతర పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని శిక్షిస్తామని మల్కాజిగిరి ఏసీపీ జీ.సందీప్ చెప్పారు. మండల కేంద్రంలోని బ్రుక్‌బాండ్ కంపెని ఎదురుగా ఉన్న దర్గావద్ద గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి జెండాను దగ్ధం చేయటంతో స్థానికులు ఆందోళన జరిపారు. ఈ నెలలోనే రెండు సార్లు జెండాలను దగ్ధం చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఆరోపిస్తు కొంతమంది ఆందోళనకు దిగటంతో తీవ్రఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటామని తెలుపగా గతంలో జరిగిన సంఘటన సంబంధించిన దానిపై ఏమి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. తాము ఆందోళన చేపడుతామని, జాతీయ రహదారిపై రాస్తారోకో జరుపుతామని ర్యాలీగా వెళ్లుచుండగా ఏసీపీ సందీప్ చేరుకుని నిరంతర పికెట్ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. శనివారం నాటికి దర్గా వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఇన్స్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి హామి యిచ్చారు. దోషులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇవ్వటంలో ఆందోళన విరమించారు. మండల మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మూడు నియోజకవర్గాల్లో జోరు వికారాబాద్‌లో బేజారు
వికారాబాద్, అక్టోబర్ 19: రాష్ట్రంలో ఎన్నికలు కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నా వికారాబాద్ జిల్లాలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. జిల్లాలోని తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అటు టీఆర్‌ఎస్ ఇటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌లు ప్రచారం కొనసాగిస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఎలాంటి సందడి కనిపించడంలేదు. టీఆర్‌ఎస్ టికెట్ కోరుతున్న ఆశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రాజకీయాల్లో ఉన్న వారితో పాటు వైద్యులు, న్యాయవాదులు టికెట్‌ను ఆశిస్తుండటం, వారి వెంట స్థానిక నాయకులు ఉండటంతో కొంత మేర హల్‌చల్ కనిపిస్తోంది. నియోజకవర్గానికి చెందిన నాయకులు కొందరు స్థానికేతరులను రంగంలోకి దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మండలాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా, మరో మాజీ మంత్రి చంద్రశేఖర్ టికెట్ కోసం దిల్లీ స్థాయిలో అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. తాండూర్‌లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ టికెట్ కోసం అటు మహరాజ్ కుటుంబం ఇటు రోహిత్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మా రెడ్డి పోటీ పడుతున్నారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి మాజీ మంత్రులను రంగంలోకి దించి ప్రచారం నిర్వహిస్తుండగా, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంతా తానై ప్రజలను కలుస్తున్నాడు. పరిగిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మహేశ్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటాపోటీగా గ్రామాల్లో తిరుగుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి అభ్యర్థుల ప్రకటన ఎపుడు జరుగుతుందో ఎపుడు ఎన్నికల కళ వస్తుందో వేచి చూడాల్సిందే.