హైదరాబాద్

సొంతింటికి ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: మహానగరంలో నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది మళ్లీ వ్యక్తిగత నివాసాలపైనే మొగ్గు చూపుతున్నారు. కొంతకాలం క్రితం వరకు అపార్ట్‌మెంట్‌లో నివసించేందుకు ఎంతో ఇష్టపడే ధనిక, మధ్య తరగతికి చెందిన ప్రజలు ఇపుడు వ్యక్తిగత నివాసాలనే ఇష్టపడుతున్నారు. ఇందుకు ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ జారీ చేసిన అనుమతుల సంఖ్యను బట్టి చెప్పవచ్చు. చిన్నాచితక మొదలుకుని బడా నిర్మాణాలకు సంబంధించి మొత్తం కలిపి జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు 16వేల పై చిలుకు అనుమతులను జారీ చేయగా, అందులో సుమారు 13వేల వరకు వ్యక్తిగత నివాసాలకు సంబంధించినవే ఉండటం విశేషం. ఐటీ, అంతర్జాతీయ సంస్థలు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వస్తుండటం, మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో నిర్మాణాలకు చాల సంస్థలు ముందుకొస్తున్నాయి. అంతేగాక, ఇతర ప్రాంతాలతో పోల్చితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన హైదరాబాద్ నగరం కొంత వరకు మేలు అన్న విషయాన్ని ఇటీవలే అధ్యయనాలు చేసిన పలు సంస్థల నివేదికలు వెల్లడించటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా హైదరాబాద్ శివార్లలో స్థలాలు కొని మరీ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా ఇప్పటికే పలు సర్వేలు తేల్చటంతో కార్పొరేట్ సంస్థల నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. ఇందులో బడా నిర్మాణాల మాట అలా ఉంచితే, గడిచిన సంవత్సరకాలం నుంచి వ్యక్తిగత నివాసాల నిర్మాణాలు గణనీయంగా పెరిగాయి. నగరవాసులు అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నివాసాల కన్నా వ్యక్తిగత నివాసాలపైనే ఆసక్తి ఎక్కువ చూపుతున్నారు. ఎక్కువ మొత్తంలో ఉన్న స్థలాల్లో సైతం యజమానులు వ్యక్తిగత నివాసాలనే నిర్మించుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, యజమానులను నమ్మించి మోసం చేయటమో, లేక బహుళ అంతస్తు భవన నిర్మాణాలకు విధించిన నిబంధనలు కారణమో గానీ ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు జారీ చేసిన నిర్మాణ అనుమతుల్లో 90 శాతం వ్యక్తిగత నివాసాలకు సంబంధించినవే ఉండటం విశేషం.
జీహెచ్‌ఎంసీ జారీ చేసిన అనుమతుల వివరాలు
జీహెచ్‌ఎంసీ అధికారులు గత ఆర్థిక సంవత్సరంలో 2017-18లో మొత్తం 15వేల 215 అనుమతులు జారీ చేసి, వాటి ద్వారా రూ. 647.02 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. అందులో సుమారు 14వేల 526 అనుమతులు వ్యక్తిగత నివాసాలకు సంబంధించినివే ఉన్నట్టు అధికారులు తెలిపారు. వెయ్యి ఐదు అనుమతులు అపార్ట్‌మెంట్ల అనుమతులు, 99 బహుళ అంతస్తు వాణిజ్య భవనాల అనుమతులున్నాయి.