హైదరాబాద్

ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు కొలిక్కొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: త్వరలో జరగనున్న ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు ఓ కొలిక్కొచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన నగరానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం వస్తున్నందున జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆయన శనివారం సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకతతో, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల ఏర్పాటు, పోలింగ్ బూత్‌లలో కనీస వసతుల కల్పన, కోడ్ అమలు, సిబ్బంది, శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల బందోబస్తు, అధికారులకు శిక్షణ వంటి ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై తరుచూ జిల్లా ఎన్నికల అధికారితో చర్చిస్తూ,ప్రతిరోజు కేంద్ర ఎన్నికల సంఘంకు వీడియో కాన్ఫరెన్స్‌లో వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన నగరానికి రానున్న ఎన్నికల సంఘం బృందం ముందుగా గుర్తింపు పొందిన ఒక్కో రాజకీయ పార్టీకి చెందిన ప్రతి ఇద్దరు నేతలతో ఎన్నికల సంఘం ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, ఈవీఎంలు,వీవీ ప్యాట్‌లపై అవగాహన, ఓటరు జాబితా వంటి అంశాలకు సంబంధించి రాజకీయ నేతలు ఇచ్చే ఫీడ్ బ్యాక్‌పై మళ్లీ ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా ఎన్నికల అధికారితో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్లు రజత్‌కుమార్ తెలిపారు. ఆ తర్వాత తుది దశగా ఒక రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగంతో, ఇతర ఎన్నికల సిబ్బందితో ఎన్నికల సంఘం సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చట్టచివరి ఘట్టంగా చీఫ్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులతో ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందే రైల్వే, విమానయాన, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్టు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశమున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హాజరయ్యారు.

పట్టపగలే దోపిడీ
కేపీహెచ్‌బీకాలనీ, అక్టోబర్ 20 : పట్టపగలే ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రసన్నకుమార్ కథనం ప్రకారం కూకట్‌పల్లిలోని సప్తగిరికాలనీలోనివాస ముంటున్న కామేశ్వర్‌రావు శనివారం ఉద్యోగానికి వెళ్లగా కవిత ఇంట్లో వంట చేస్తుంది. సుమారు 12 గంటల సమయంలో కవిత వంట గదిలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి నేరుగా ఇంట్లోని పడక గదిలోకి వెళ్లి దోపిడీ చేసి కవితపై దాడి చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మవారి ఉరేగింపులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణ
నేరేడ్‌మెట్, అక్టోబర్ 20: మల్కాజిగిరిలో శుక్రవారం రాత్రి జరిగిన అమ్మవారి ఉరేగింపుకార్యక్రమంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య జరిగిన గొడవలో ఒకరి పై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు మల్కాజిగిరి సీఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ ఎన్.జగదీష్ గౌడ్ అమ్మవారిని ఉరేగింపు కార్యక్రమం నిర్వహిస్తుండగా అతడి కుమారులు అభిషేక్, ఆరవింద్‌లు కాంగ్రెస్ నాయకుడు బాలచందర్ పై దాడి చేసారని తెలిపారు. బాలచందర్ అనుచరులు తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించగా అదే సమయంలో అక్కడే ఉన్న కార్పొరేటర్ అతని అనుచరులు వారిని అడుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు సీఐ తెలిపారు. బాలచందర్ ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ అతడి కుమారులు పై బాలచందర్ అతని అనుచరుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.