క్రైమ్/లీగల్

యువతి ప్రాణం తీసినమృగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అల్వాల్, అక్టోబర్ 21: యువకుల వేధింపులు, వెలికి చేష్టలు, బెదిరింపులు ఓ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న సంఘటన నగరంలో చోటుచేసుకుంది. యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కంటోనె్మంట్‌లోని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తిరుమలగిరిలోని సాయిబాబా హట్స్‌లో నెల రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలస్వామి, లక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు, కుమారునితో బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలు కూలి పనులకు వెళ్ళగా కుమార్తె వౌనిక (17 ) స్థానికంగా ఇళ్ల్లలో పని చేస్తుంది. అక్కడ పరిచమైన మహేష్ అనే యువకుడు తనను ప్రేమించాలని వేధించటం ప్రారంభించాడు. అదే క్రమంలో మరికొందరు యువకులు కలిసి వౌనికను వేధించారు. అదే కాకుండా తమ స్నేహితున్ని ప్రేమించకుంటే యువతి తల్లిదండ్రుల్ని చంపేస్తామంటూ నిందితునితో పాటు మరో ఎనిమిది మంది ఇటీవల బెదిరింపులకు దిగారని పోలీసులు తెలిపారు. దీంతో తనవారిని ఏం చేస్తారోనని తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గుడిసెలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉన్న వౌనిక సోదరుడు చరణ్ వెంటనే గమనించి కేకలు వెయ్యటంతో ఇరుగుపొరుగు వారు వచ్చి వౌనికను నవజీవన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై మృతిరాలి తండ్రి బాలస్వామి తిరుమలగిరి పోలీసులకు లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారు. బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ దాదాపు 40 మంది బస్తీవాసులు సంతకాలు చేసిన ఫిర్యాదును కూడా పోలీసులకు అందజేశారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో ఉంచారు. ఈ కేసును బేగంమేట ఏసీపీ ఆధ్వర్యంలో సీఐ రవికుమార్ నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
నిందితులపై చర్య తీసుకుంటాం :ఏసీపీ రామిరెడ్డి వెల్లడి
యువతి బలవన్మరణానికి సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామనీ ఏసీపీ రామిరెడ్డి చెప్పారు. నిందితులను అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామనీ వివరించారు.