హైదరాబాద్

పోలీసుల త్యాగం మరువలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 21: దేశం కోసం ప్రజాస్వామ్యంలో పోలీసుల త్యాగం మరువలేనిదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్, జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ అన్నారు. ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీసు మైదానంలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించి, వౌనం పాటించారు. ఈసందర్భంగా పరేడ్ నిర్వహించగా, గౌరవ వందనం స్వీకరించారు. దేశంలో అసువులు బాసిన 414 మంది పేర్లను జిల్లా అదనపు ఎస్పీ పీ.నర్సింలు చదివి వినిపించగా వారి సేవలను స్మరించుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని చెప్పారు. పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో మంచిపేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు మన మధ్య లేకున్నా మనం వారిని స్మరిస్తూనే ఉంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. త్యాగం చేసిన పోలీసు కుటుంబాలకు ఎలాంటి సమస్య ఉన్నా పోలీసు విభాగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు వీరమరణం పొందారని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడబ్ల్యూ జాన్సన్, వికారాబాద్, తాండూర్, పరిగి డీఎస్పీలు శిరీష, రామచంద్రుడు, శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు, సీఐలు సీతయ్య, బీ.శ్రీనివాస్, ఎస్‌ఐలు లక్ష్మయ్య, అరుణ్‌కుమార్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.