హైదరాబాద్

మల్లిఖార్జున స్వామి కల్యాణ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 8: కాచిగూడలోని వీరన్నగుట్టపైనున్న శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ప్రంగణంలో శ్రీమల్లిఖార్జున స్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఒగ్గుకథ కళాకారులు అలపించిన మల్లన్న కథ భక్తులను మంత్రముత్దులను చేసింది. పుట్ట బంగారం పూజ, శ్రీగంగాదేవిపూజ, శ్రీవీరభద్రస్వామి గొలుసులు తెంపే కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. స్వామివారి కళ్యాణనంతరం శ్రీమల్లిఖార్జున స్వామిని కాచిగూడ, బర్కత్‌పుర విధుల వెంట ఊరేగించారు. వేడుకల్లోకార్యక్రమ నిర్వహకులు ఎస్‌బి మురళీ శేఖర్, సత్యనారాయణ, ఎస్‌ఎస్ రాము, నర్సింగ్‌రావు, ముత్యాలు, కిరణ్, శివశంకర్ అగర్వాల్, వేద ప్రకాష్, కనె్న రమేష్ యాదవ్, కాచిగూడ ఇన్‌స్పెక్టర్ డి.రాజ్‌కుమార్, డిఐ జగదీశ్వర్‌రావు పాల్గొన్నారు.