హైదరాబాద్

వైభవంగా దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు రవీంద్రభారతిలో వైభవంగా జరిగాయి. ఉత్సవాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి దత్తాత్రేయ ప్రారంభించారు. సిఎం కెసిఆర్, ప్రధాని మోదీ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని పొగిడారు. పంచాం గం ప్రకారం కార్మికులు శక్తికి మించి కృషి చేస్తే శ్రమయేవ జయతే అన్నట్లు వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్నారు. తెలంగాణలో రైతుల సమస్యల పరిష్కారానికి మిషన్ భగీరథతో శాశ్వతంగా నీటి సౌకర్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పంచాంగ పఠనంలో భారతీయ సంస్కృతి గొప్పది అన్నట్లు దానిని కాపాడుకుంటూ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుందామని దత్తాత్రేయ అన్నారు. సిఎం కెసిఆర్‌తోపాటు మంత్రులు కడియం శ్రీహరి, అజ్మీరా చందూలాల్ వేదపండితులను సత్కరించారు. వేములవాడ ఆస్థాన పండితులు రాజీవ్‌శర్మ, శృంగేరి పీఠం ఆస్థాన పండితులు గోపీకృష్ణ శర్మ, భద్రాచల వేదపాఠశాల పండితులు లింగాల రామకృష్ణశర్మ, మేడారం అర్చకులు సారయ్య, చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి సిద్ధాంతి క్షేత్ర మోహన్ తివారి, పెద్దమ్మగుడి అర్చకులు మాధవశర్మ, కీసర ఆలయ పండితులు ఎం.సత్యనారాయణశర్మ, నాదస్వర కళాకారులు (్భద్రాచలం) వౌలానాను సత్కరించారు. తొలుత భద్రాచల సీతారాముల కల్యాణ ఆహ్వాన శుభలేఖను దేవాదాయశాఖ కమిషనర్ సిఎం కెసిఆర్‌కు ఇచ్చి కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం యాదగిరి గుట్ట దేవస్థానం ప్రచురించిన పంచాంగాన్ని కెసిఆర్ ఆవిష్కరించారు. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, టిపిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి, మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎం.హరికృష్ణ పాల్గొన్నారు. దుర్ముఖినామ సంవత్సరంలో తెలంగాణకు ఎలాంటి భయం లేదని, చుట్టు వున్న భద్రాచల సీతారామచంద్రులు, యాదా ద్రి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కీసర రామలింగేశ్వరుడు రాష్ట్రానికి రక్షణ కవచంగా వున్నారని పంచాంగ పఠనం చేసిన సంతోష్‌కుమార్ శాస్ర్తీ అన్నారు. ఉగాది శుక్రవారం రావడం శుక్రుడు ప్రధానమైనవాడు.. రాజువల్ల ప్రజలు ఆనందంగా వుంటారు.. వర్షాలు కురిసి, పంటలు పండుతాయి.. గోవులు స్వేచ్ఛగా తిరుగుతాయి.. భార్యాభర్తలు అనుకూలంగా అన్యోన్యంగా వుంటారు.. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, పరిపాలన బాగుంటుందని అంతా శుభమే జరుగుతుందని అన్నారు. విద్యారంగంపై సిఎం దృష్టి మరలిస్తే బాగుంటుందని అన్నారు. బంగారు తెలంగాణ సంగీత నృత్య రూపకం అందరినీ అలరించింది.