హైదరాబాద్

ఎంపీ మల్లారెడ్డికి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ టీఆర్‌ఎస్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల నాయకులు ఎంపీని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లా రెడ్డి, శేఖర్ గౌడ్, మల్లికార్జున్, నర్సింహా రెడ్డి, వీర్లపల్లి భాగ్యరెడ్డి, మోహన్ రెడ్డి, హరిమోహన్ రెడ్డి, పానుగంటి రవీందర్ పాల్గొన్నారు.

అనాథాశ్రమంలో పండుగ వేడుక
దిల్‌సుఖ్‌నగర్, నవంబర్ 8: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతికి పెద్ద పీట వేసిందని ఎల్‌బినగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గడ్డిఅన్నారం డివిజన్‌లోని పలు కాలనీలలో పాదయాత్ర నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గడ్డిఅన్నారం డివిజన్‌లో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. దీపావళి పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి అనాథాశ్రమంలో చేసుకున్నారు. కార్యక్రమంలో బిజినేపల్లి వెంకటేశ్వర్ రావు, తులసి శ్రీనివాస్, ప్రతీక్ రావు, రమేష్ ముదిరాజ్, వీఎస్‌ఎన్ శ్రీనివాస్, వన్నాడి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, కాసం రాంరెడ్డి, బైర శంకర్, బన్నీ పాల్గొన్నారు.

దివ్యాంగులకు కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్
వికారాబాద్, నవంబర్ 8: దివ్యాంగులు(విభిన్న ప్రతిభావంతులు)తమ ఓటరు స్థితిని, దగ్గరలోని పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళడానికి అనువుగా ఏర్పాటు చేయబడిన వాహనాలు/సహయక వ్యక్తులు(వాలంటీర్లు)వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన హెల్ప్‌లైన్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. వారికి ఏర్పాటు చేసిన సౌకర్యాలను తెలుసుకుని ఉపయోగించుకోవాలని కోరారు. హెల్ప్‌లైన్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుందని చెప్పారు.

టికెట్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరిన కృష్ణయ్య
వికారాబాద్, నవంబర్ 8: సీనియర్ నాయకుడనైన తనకే వికారాబాద్ టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు బీ.కృష్ణయ్య మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి కోరారు.
బీజేపీలో చేరిక
వికారాబాద్, నవంబర్ 8: బీజేపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఆర్.సాయికృష్ణ సమక్షంలో మర్పల్లి, బంట్వారం మండలాలకు చెందిన 50 మంది యువకులు గురువారం బీజేపీలో చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చాలా బాగున్నందునే బీజేపీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ ప్యాట శంకర్, మర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు సాయిచరణ్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, శ్రీమంత్, పవన్ రెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, వీరన్నలు పాల్గొన్నారు.