హైదరాబాద్

ఓటరు స్లిప్‌లపై పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల సిబ్బందిచే ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్లు, ఈ సారి స్లిప్‌పై పోలింగ్ కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. అంతేగాక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో గురువారం ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ గత ఎన్నికల్లో 53 శాతం వరకు పోలింగ్ నమోదు అయిందని, ఈ సారి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు పెద్ద ఎత్తున ఓటరు చైతన్య, అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఓటింగ్‌ను పెంచటం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, దివ్యాంగులైన ఓటర్లంతా ఓటింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు, పోలింగ్ కేంద్రాలను గుర్తించటం తదితర అంశాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులైన ఓటర్ల కోసం మొట్టమొదటి సారిగా ‘వాదా’ యాప్‌ను మన నగరంలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 20వేల మంది ఓటరు నమోదుకు అర్హులైన వారుండగా, వీరిలో ఇప్పటికే 16వేల మందికి ఓటు హక్కు కల్పించామని తెలిపారు. మిగిలిన వారికి కూడా ఓటరుగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 40 లక్షల వరకు ఓటర్లున్నారని, ప్రతి వెయ్యి మంది జనాభాలో 930 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని వెల్లడించారు.
మొత్తం జనాభాలో సుమారు 80 శాతం వరకు అక్షరాస్యత ఉన్న హైదరాబాద్ నగరంలో కేవలం 53 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందని, ముఖ్యంగా మరికొన్ని పోలింగ్కేంద్రాల్లో 20 శాతానికి తక్కువగా ఓటింగ్ నమోదు కావటం విచారకరమని, ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించటంతో పాటు ఓటర్లంతా ముందుకొచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో వౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. 30 స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
సాధారణంగా ఎన్నికల్లో ఓటరు స్లిప్‌లను వివిధ రాజకీయపార్టీలు చెందిన నేతలు, కార్యకర్తలు ప్రజలకు పంపిణీ చేసే వారు. కానీ ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా జిల్లా ఎన్నికల సిబ్బంది ఓటరు స్లిప్‌లను పోలింగ్‌కు మూడు రోజుల ముందే పంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు.
ఈ ఓటరు స్లిప్‌లో ఓటరు వివరాలతో పాటు అతని ఓటు ఉన్న పోలింగ్ కేంద్రానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ సారి మొట్టమొదటి సారిగా వీవీ ప్యాట్‌లను వినియోగిస్తున్నందున ఈవీఎం, వీవీప్యాట్‌లపై అవగాహనను పెంపొందించేందుకు నిర్వహించిన డమీ ఓటింగ్‌లో సుమారు మూడు లక్షల మంది పాల్గొన్నారని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ డమీ ఓటింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు.