హైదరాబాద్

1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోతే డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయనున్నట్టు తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌హెచ్‌ఏ) ప్రకటించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాకేష్, హరిప్రకాష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కార్పొరేట్ వైద్య చికిత్సలు అందించేందుకు అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ఇందుకుగాను ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆయా చికిత్సలను బట్టి చెల్లింపులు జరుపుతూ వచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీనికితోడు ఇహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ వంటి పథకాలను తీసుకురావడంతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. తగ్గట్టుగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. సుమారు రూ.1200 కోట్లు ఈ పథకం క్రింద చెల్లింపులు జరపాల్సి ఉండగా నాన్చుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు వెంటనే చెల్లింపులు జరపాలని సమ్మె నోటీసులను ట్రస్ట్ సీఇఓ మాణిక్యరాజ్‌కు అందజేసినట్టు వివరించారు. ఈనెల 20 వరకు వేచి చూస్తామని, స్పందించకుంటే మొదట ఓపీ, డయాగ్నస్టిక్ సేవలు బంద్ చేస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో డిసెంబర్ 1 నుంచి అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అసోసియేషన్ వైద్యులు రమేష్, జయ ప్రకాష్, వెంకట రమణ, రామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.