హైదరాబాద్

పారదర్శకంగా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా కృషి చేద్దామని ఎన్నికల నిఘా వేదిక పిలుపు నిచ్చింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదిక ప్రతినిధులు రావు చెలకాని, వీవీ రావు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు పాదర్శకంగా జరిగితేనే ప్రజలకు నీతి వంతమైన పాలన లభిస్తోందని అన్నారు. రూ.లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గేవారు ప్రజలకు నాణ్యమైన సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ సారి జరుగుతున్న ఎన్నికలు ప్రలోభాలకు తావులేకుండా జరిగేలా ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఎన్నికల కమిషన్ రూపొందించిన సీ-విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా జరిగే ఫోటోలు, వీడియోలను తీసి ఫిర్యాదు చేయలని పేర్కొన్నారు. అదే విధంగా నియోజక వర్గాల వారీగా ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి నెంబర్లు తీసుకొని ఫిర్యాదులు అందించాలని, అప్పటికీ స్పందించక పోతే తమకు తెలియజేస్తే ఉన్నతాధికారులకు సదరు విషయాలను పంపుతామని చెప్పారు.

పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలి
* డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ల సమీక్షలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 12: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు బందోబస్తుపై దృష్టి సారించి, ఎన్నికలకు నగర పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఆయా ప్రాంతా ల్లో భారీ బందోబస్తుతో పాటు పటిష్ట నిఘాను ముమ్మరం చేశారు. నగరం లో అత్యధీకంగా 15 నియోజకవర్గాలు ఉండటంతోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ సిటీవోనే ఏర్పాటు చేస్తుండటంతో నగర పోలీసులకు ఆగ్ని పరీక్షలా మారింది. నామినేషన్‌లు దాఖలు చేసే రిటర్నింగ్ అధికారుల కార్యాలయా లు, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాల అధారంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తును చేపడుతున్నారు. నామినేషన్‌లు దాఖ లు చేసే ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయల వద్ద ఉదయం నుంచి సాయం త్రం వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతాపై నగర పోలీసులు దృష్టి సారించారు. నగరంలోని వివిధ పోలీస్టేషన్‌ల పరిధిలోని పాత నేరగాళ్లపై దృష్టి సారించిన పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేశారు. 1800 కేసుల్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్లపై చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గన్ లైసెన్స్ కలిగిన 4100 మంది తమ ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగింది. నగరంలోని 3866 పోలీంగ్ కేం ద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ను ముమ్మరం చేసిన సీపీ 13 కౌంటిం గ్ కేంద్రాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా పాతబస్తీలో ఎలాంటి సంఘటనలూ చోటు చేసుకోకుండా ఉండేందుకు కవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఉన్నాతాధికారులు సూచనలు, సలహాలిస్తున్నారు.
క్రైమ్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లతో సమావేశమైన సీపీ అంజనీ కుమార్
నగరంలో జరుగనున్న ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నగర నేరాలు, సిట్ అదనపు కమిషనర్ శిఖా గోయల్‌తో కలిసి సోమవారం నగరంలోని అన్ని పోలీస్టేషన్లకు చెందిన క్రైమ్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు స్టేషన్ల పరిధిలోని పాత నేరగాళ్ల కదలికలు, బైండోవర్‌లు, హవాల సొమ్ము స్వాధీనం, ప్లాగ్‌మార్చ్, స్నాచింగ్ కేసుల పురోగతి వంటి ఇతర అంశాలతో పాటు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయ వద్ద బందోబస్తుపై నగర పోలీసు కమిషనర్ పోలీస్టేషన్ల వారిగా అడిగి తెలుసుకున్నారు. నగరంలో ప్రశాంతా వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియేగించేలా శాంతి భద్రతలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. పోలీసులు ఎల్లపుడు అప్రమత్తంగా ఉండి నేర చరిత కలిగిన వారిపట్ల నిఘా పెట్టాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా వదలేదిలేదాని సీపీ స్పష్టం చేశారు.