రంగారెడ్డి

తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలి: సిఐటియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, ఏప్రిల్ 9: ధారూర్ మండలం కెరెళ్లి గ్రామంలో తాగునీటి ఎద్దడిని తీర్చాలని సిఐటియు వికారాబాద్ డివిజన్ కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో కెరెళ్ళి గ్రామంలో సిఐటియు బృందం గ్రామాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సర్పంచ్, కార్యదర్శిలు గ్రామంలో స్థానికంగా ఉండడం లేదని దీంతో తాగునీటి ఎద్దడి నెలకొందని ఆరోపించారు. మహిళలు బెందెలతో రోడ్డుపైకి వస్తున్నారని అధికారులకు ఇవి పట్టడం లేదని అన్నారు.
గ్రామంలో ఏడు బోర్లు పాడయిపోయి నీరు పూర్తిగా రావడం లేదని, ఐదు బోర్లలో మాత్రమే నీరు వస్తోందని అవి గ్రామానికగంతటికీ సరిపడా అందించలేక పోతున్నాయన్నారు. ఎస్సీ, బిసి కాలనీలలో కొత్తగా బోర్లు వేయించి నీటి ఎద్దడిని ఈర్చాలని కోరారు.
కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి అనంతయ్య, వెంకటయ్య, రంగయ్య, నర్సింహ్మరెడ్డి, దస్తగిరి, రాములమ్మ, బిచ్చమ్మ, అనంతమ్మ పాల్గొన్నారు.