హైదరాబాద్

ఆప్ అధికారంలోకి వస్తే దిల్లీ తరహా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే దిల్లీ తరహాలో పాలన అందిస్తామని రాష్ట్ర కన్వీనర్ రాము గౌడ్ పేర్కొన్నారు. గురువారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మూడవ విడత అభ్యర్థులను ప్రకటించారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. విద్య, వైద్యం, రవాణా, విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి సుపరిపాలన అందిస్తుందని చెప్పారు. దేశంలోనే విద్యా రంగానికి బడ్జెట్‌లో 26శాతం కేటాయించామని, ఇప్పటి వరకు రూ.56వేల కోట్లు విద్య కేటాయించినట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలు పోటీ చేస్తామని, అధికారంలోకి వస్తే నీతివంతమైన సమర్థవంతమైన పాలన అందిస్తామని తెలిపారు. నిజాం మునిమనవడు రౌనత్ యార్ ఖాన్ మాట్లాడుతూ అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం దిల్లీ రాష్ట్ర అభివృద్ధికి తీసుకువచ్చిన సంస్కరణలకు ఆకర్శితులైపార్టీలో చేరినట్టు తెలిపారు. పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.

18న రచయితల రాష్ట్ర మహాసభలు
ఖైరతాబాద్, నవంబర్ 15: తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈనెల 18న రచయితల రాష్ట్ర మహాసభలను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహాసభల పోస్టర్‌ను సీనియర్ పాత్రికేయులు పోత్తూరి వెంకటేశ్వర రావు, రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమల రావు ఆవిష్కరించారు. సభలకు 200 మంది రచయితలు హాజరవుతున్నట్టు చెప్పారు. ప్రారంభ సమావేశంలో సాహిత్యం సాంస్కృతిక రంగ - వర్తమానం సవాళ్లు అనే అంశంపై చర్చ ఉంటుందని, రెండవ సమావేశంలో ‘ ఎన్నికలు - ప్రజల కర్తవ్యాలు - రచయితలు’ అనే అంశంపై చర్చిస్తామని చెప్పారు. ఇక మూడవ సమావేశంలో మేనిఫెస్టోలు - భాషా సాంస్కృతిక రంగాలు - వివిధ పార్టీలు’ అనే అంశంపై చర్చ ఉంటుదని తెలిపారు. సమావేశాలకు సుప్రసిద్ధ తమిళ రచయిత్రి మాజీ ఐఏఎస్ అధికారిణి శివ కామి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరవుతారని చెప్పారు.