హైదరాబాద్

జలమండలి ‘సీవరేజీ’కి మరో కేంద్ర అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జంటనగరవాసుల దాహార్తిని తీర్చే జలమండలి నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీవరేజీను పరిశుభ్రపరిచేందుకు అనుసరిస్తున్న విధానానికి కేంద్రం మరో అవార్డును ప్రకటించింది. సీవరేజీ వ్యవస్థను శుభ్రపరిచేందుకు అమలు చేస్తున్న అమృత్ టెక్నాలజీని చాలెంజ్ క్యాటగిరీకి జలమండలిని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపింది. ఈ అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా న్యూ డిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రదానం చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నగరవాసులకు మరుగుతో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ఎప్పటికపుడు నూతన ఆవిష్కరణలను చేపడుతోంది. చిన్న చిన్న గల్లీల్లో పారిశుద్ద్య పనులను ఎలాంటి ఆటంకాల్లేకుండా చేపట్టేందుకు వీలుగా యంత్రాల రూపకల్పన చేయటాన్ని కేంద్రం ప్రత్యేకంగా అభినందించింది. అంతకు మంచి గతంలో ఈ సీవరేజీ పైప్‌లైన్లను శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోళ్లలోకి దిగిన కొందరు కార్మికులు దుర్మరణం పాలు కావటంతో ఈ విధానాన్ని జలమండలి పూర్తిగా నిషేధించింది. సీవరేజీ వ్యవస్థను శుభ్రపరిచే అంశంలో రోబోలను వినయోగించే ప్రతిపాదనను కూడా జలమండలి పరిశీలిస్తోంది. జలమండలికి కేంద్ర ప్రభుత్వం మరో అవార్డును ప్రకటించటంతో జలమండలి ఎండీ దాన కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ అవార్డు సాధించుకున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏ మాత్రం జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జలమండలి ఈడీ ఎం.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్లమ్మబండ, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లి, సైదాబాద్ ప్రాంతాల్లో అరకొర మంచినీటి సరఫరా జరుగుతుందని, లో ప్రెషర్ ఉంటుందని నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే మీట్ యువర్ ఎండీలో కూడా నాగోల్, యాకుత్‌పురా, నిజాంపేట, మోతీనగర్, కొండాపూర్, మారేడ్‌పల్లి ప్రాంతాల నుంచి పది ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించాలని ఈడీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవిలతో పాటు వివిధ విభాగాలకు చెందిన సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.

హైదరాబాద్, నిజామాబాద్ జట్ల శుభారంభం
* అండర్-14 బాలబాలికల రగ్భీ టోర్నమెంట్
హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య (టీఎస్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన 64వ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల రగ్భీ టోర్నమెంట్‌లో హైదరాబాద్, నిజామాబాద్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించి శుభారంభం చేశాయి.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని గండిపేట్‌లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో శనివారం టోర్నమెంట్ ప్రారంభమైంది.
టోర్నమెంట్‌లో 9 జిల్లాలకు చెందిన 220 మంది క్రీడాకారులతో పాటు 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మల్లక కోమరయ్య విచ్చేసి పోటీలను ప్రారంభించారు.
కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జీ.నిది, అడ్మిన్ మేనేజర్ వినీత్, టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి జీ.జగదీశ్వర్ రెడ్డి, పీఈటీల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
నిర్వహించిన మ్యాచ్‌ల్లో బాలుర విభాగంలో నిజామాబాద్ 10-5 స్కోరు తేడాతో వరంగల్‌పై, వరంగల్ 5-0 తేడాతో కరీంనగర్‌పై, నిజామాబాద్ 5-0తో మెదక్‌పై, బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 10-5 స్కోరు తేడాతో అదిలాబాద్‌పై, నల్గొండ 15-0తో నిజామాబాద్‌పై, మహబుబ్‌నగర్ 5-0తో రంగారెడ్డిపై విజయం సాధించింది.
వేణు, అభినయ్ బ్యాటింగ్‌తో
ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్ ఘనవిజయం
* హెచ్‌సీఎ ఏ-3 డివిజన్ వనే్డ లీగ్ క్రికెట్ టోర్నీ
హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ-3 డివిజన్ వనే్డ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో 13 ఏళ్ల దర్శ్ అభినయ్, టీ.వరుణ్‌లు కలిసి కట్టుగా అడి సెంచరీలు సాధించడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్ 292 పరుగుల తేడాతో ప్రత్యర్థి సత్యం కోల్ట్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది.
దర్శ్ అభినయ్ 94 బంతుల్లో 18 బౌండరీలు, ఒక సిక్సర్ సహాయంతో 111 పరుగులు, మరో బ్యాట్స్‌మన్ టీ.వేణు 177 పరుగులు చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 432 పరుగులు సాధించింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేపట్టిన సత్యం కోల్ట్స్ జట్టు 29.4 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్ జట్టు బౌలర్ సాకేత్ 54 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్ జట్టు బ్యాటింగ్‌లో వరుణ్, అభినయ్, బౌలింగ్‌లో సాకేత్‌లు రాణించడంతో విజయం అసన్నమైంది.