హైదరాబాద్

మజ్లిస్‌కు ఎదురేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం మజ్లిస్ అభ్యర్థిగా అక్బరుద్దీన్ ఓవైసీ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్‌లతో కలిసి శనివారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌ల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అక్బర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్బర్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం జంగమెట్ ఖాద్రీ చమాన్ నుంచి ఓపెన్ టాప్ జీప్‌లో ర్యాలీగా బయలుదేరారు. ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ నామినేషన్ సందర్భంగా పోలీసులు బండ్లగూడ తాహశీల్దార్ కార్యాలయం వద్ద రెట్టింపు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మజ్లిస్‌కు ఎదురేలేదని, అఖండ విజయం సాధిస్తానని, తన విజయాన్ని ఏ శక్తి ఆపలేదని అన్నారు. చాంద్రాయణగుట్ట నియోజవర్గంలోని అనేక బస్తీలో కనీస సదుపాయాల కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ర్యాలీలో కార్పొరేటర్ సలీంబేగ్‌తో పాటు ఎంఐఎం సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎత్తుకు పై ఎత్తు!
* పాదయాత్రలు..రహస్య సమావేశాలు

హైదరాబాద్, నవంబర్ 17: ముందస్తు ఎన్నికల్లో ఇప్పటికే అభ్యర్థులుగా ఖరారై, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార బాట పట్టిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని దాదాపు అన్ని స్థానాల్లోనూ సిట్టింగ్ అభ్యర్థులు తమకు ప్రత్యర్థి అభ్యర్థిని గుర్తించి, వారి ప్రచార శైలిని ఎదుర్కొనేందుకు అందుకు ప్రతికూల మార్గాలను అనుసరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కో నియోజకవర్గంలో సిట్టింగ్, ప్రధాన ప్రత్యర్థులు ఒకరి షెడ్యూల్ ప్రకారం మరొకరు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా కాలనీ సంక్షేమ, యువజన సంఘాలతో పాటు అపార్ట్‌మెంట్లు, బస్తీలు, మురికివాడల ప్రజలతో కలిసి ఉదయం, సాయంత్రం పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ రహస్య సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. సిట్టింగ్‌లు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు, పరిష్కరించిన సమస్యలను వివరిస్తుండగా, తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ మరికొందరు అభ్యర్థులు ఓటరు దేవుళ్లకు దండాలు పెడుతున్నారు. ఒక నియోజకవర్గంలో ఉదయం మురికివాడల ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఓ అభ్యర్థి పాదయాత్ర నిర్వహిస్తే, ఆ సమాచారం తెలుసుకున్న ఆ అభ్యర్థి ప్రత్యర్థి అదే రోజు సాయంత్రం ఆ మురికివాడలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు టీ స్టాల్‌లో టీ పోయగా, ప్రత్యర్థి ఒక అడుగు ముందుకేసీ టిఫిన్లు వడ్డిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించటంతో వారు రోజుకు పది నుంచి 12 గంటల పాటు ప్రజల్లో ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల్లో సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాసయాదవ్, సికిందరాబాద్‌లో పద్మారావు, టికెట్ ఖరారుకు కాస్త లేటు అయినా ఖైరతాబాద్ అధికార పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు లెటెస్టుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాత్రి పది గంటల తర్వాత వివిధ కాలనీలు, బస్తీలు, మురికివాడల వారీగా శిబిరాలను నిర్వహిస్తూ, తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. కానీ కొంత కష్టంగా ఉన్న మజ్లీస్ స్థానాలు మలక్‌పేట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎంపీ అసదుద్దిన్ ఇప్పటికే ప్రజల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాంపల్లిలో మజ్లీస్ అభ్యర్థి జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌లు ఒకరు పాదయాత్ర నిర్వహించిన చోట మరొకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు చోట్ల మజ్లీస్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని గాడీన పెట్టేందుకే ఆ పార్టీ ఎంపీ అసద్ రంగంలో దిగినట్లు చెప్పవచ్చు.

రూ.10వేలు దాటితే..!
అకౌంట్ పే చెక్కుతో చెల్లించాలి
*అభ్యర్థులకు హైదరాబాద్ ఎన్నికల అధికారి డీకే సూచన

హైదరాబాద్, నవంబర్ 17: అసెంబ్లీకి జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వివిధ రకాల ప్రచార కార్యక్రమాల నిర్వాహణలో భాగంగా రూ. 10వేలు దాటితే అకౌంట్ పే ద్వారా చెల్లించాలని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ సూచించారు.
గతంలో ఎన్నికల వ్యయానికి సంబంధించి రూ.20వేలకు పరిమితం చేసిందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పేరుపై ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని, ఎన్నికల ప్రచార లావాదేవీలకు సంబంధించిన చెల్లింపులన్నీ బ్యాంకు అకౌంట్ ద్వారానే సంబంధిత వ్యక్తులకు లేదా సంస్థలకు అకౌంట్ పే చెక్కు ద్వారా ఆర్టీజీఎస్, డ్రాఫ్ట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ విభాగంలో చెల్లించాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక రిజిష్టర్‌ను ఏర్పాటు చేసి, ఆ రిజిస్టర్‌లో నామినేషన్‌కు అయిన ఖర్చు, ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వాహణకు అయ్యే ఖర్చు వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉపయోగించే పలు రకాల ప్రచార సామాగ్రి, వాహానాలు, ప్రకటనలు, సభలు, సమావేశాల్లో ఉపయోగించే మెటీరియల్‌కు రేట్లను నిర్దారించటం జరిగిందని తెలిపారు.
19తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
సోమవారం 19వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం సెలవు రోజు కావటంతో నామినేషన్లు స్వీకరించబోమని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్ పంకజ తెలిపారు. చివరి రోజు కావటంతో నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసులు సందడిగా మారనున్నాయి. చాలా మంది ప్రముఖులు ఆయా పార్టీల అభ్యర్థులుగా, వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన వారు రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసే అవకాశమున్నందున, నగరంలోని 15 స్థానాలకు మొత్తం నామినేషన్ల సంఖ్య వేలల్లో చేరుకునే అవకాశముంది.