హైదరాబాద్

‘కోడ్’ బేఖాతర్‌పై కష్టాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ప్రవర్తనను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకుగాను సీ-విజిల్, ఈసీఐ వెబ్‌సైట్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్, ఆన్‌లైన్ ఫిర్యాదుల విభాగంతో పాటు ఫోన్ నెంబరు 18005992999 కాల్ సెంటర్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించి డబ్బు, మద్య, ఇతర సామాగ్రిని పంపిణీ చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు చేసే ప్రయత్నాలను ఫిర్యాదు చేస్తే తమకు ఎలాంటి ఢోకా ఉంటుందోనన్న భయం ఇకపై నగరవాసులకు అవసరం లేదు. ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేసేందుకు అందులో ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం సీ-విజల్ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నారు.
ఇప్పటికే ఈ యాప్ ద్వారా మొత్తం 201 ఫిర్యాదులను స్వీకరించిన ఎన్నికల సిబ్బంది ఇందులో 67 ఫిర్యాదులు బోగస్‌వని తేల్చింది. మిగిలిన వాటిలో 65 ఫిర్యాదులకు సంబంధించి నిర్ణీత సమయయంలో చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. మరో 69 ఫిర్యాదులపై చర్యలు పురోగతిలో ఉన్నట్లు, మరికొన్నింటిపై తుది నివేదికల రూపకల్పన తుది దశలో ఉన్నట్లు తెలిపారు. సీ-విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను స్వీకరించటానికి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో 15 కంప్యూటర్ల ద్వారా శిక్షితులైన సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. సీ-విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు తగు వివరాలతో సహా ఐదు నిమిషాల్లోనే తగు చర్యలు తీసుకునేందుకు వీలుగా అధికారుల బృందం వాలుతోంది. అయితే ఈ సీ-విజిల్ ద్వారా కొందరు ఆకతాయిలు తప్పుడు ఫిర్యాదులు చేయటం తమకు కొంత సమస్యగా మారిందని కూడా ఎన్నికల సిబ్బంది వాపోతుంది. 15 లైన్ల కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఎస్‌డీఎస్ పోర్టల్‌కు అనుసంధానం చేస్తున్నట్లు దాన కిషోర్ తెలిపారు.
ఎన్‌జీఎస్ ద్వారా 466 ఫిర్యాదులు
ప్రత్యేక యాప్‌లతో పాటు భారత ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్(ఎన్‌జీఎస్) ద్వారా కూడా ఎన్నికల అధికారులు 466 ఫిర్యాదులను స్వీకరించినట్లు వెల్లడించారు. వీటిలో 462 ఫిర్యాదులను పరిష్కరించినట్లు డీఈఓ దాన కిషోర్ తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా అధికంగా ఓటరు జాబితాలో సవరణలు, పేర్లలో తప్పులు, చిరునామా మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిర్వహించే ప్రచార కార్యక్రమాలైన సభలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలు వంటివి నిర్వహించేందుకు వారికి త్వరితగతిన అనుమతులిచ్చేందుకు వీలుగా ఎన్నికల సంఘం ‘సువిధ’ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1746 విన్నపాలు అందగా, వీటిలో 1121 దరఖాస్తులను ఆమోదించి, వెంటనే తగు అనుమతులు జారీ చేశామని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని డీఈఓ వెల్లడించారు.