హైదరాబాద్

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ ముందస్తు ఎన్నికలను పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ బాధ్యత బూత్ లెవెల్ ఆఫీసర్లదేనని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సూచించారు. నగరంలోని నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల బూత్ స్థాయి అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుందని, ముఖ్యంగా ఓటింగ్ శాతాన్ని పెంపొందించటం, మరణించిన, ఇల్లు మారిన ఓటర్లను గుర్తించటం, దివ్యాంగులైన ఓటర్లు నూటికి నూరు శాతం ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ఓటరు స్లిప్‌ల పంపిణీ సరిగ్గా లేకపోవడమే కారణమని వివరించారు.
ఈనెల 25వ తేదీ నుంచి ఓటరు స్లిప్‌ల పంపిణీ బూత్ స్థాయి ఏజెంట్లను, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను వెంట తీసుకుని వెళ్లి మరీ పంపిణీ చేయాలని సమాచారం. ప్రతి పోలింగ్ లొకేషన్ వద్ద ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం జారీచేసిన నియమనిబంధనల ప్రకారమే ఓటరు స్లిప్‌ల పంపిణీ చేపట్టాలని, ఓటరు స్లిప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ జిరాక్స్ చేయవద్దని సూచించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో 200పోలింగ్ కేంద్రాల్లో 40 శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైందని, ఈసారి ఎన్నికల్లో హైదరాబాద్‌లో గణనీయంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు నగరంలోనే శిక్షణ ఇస్తామని వివరించారు. జాయింట్ సీఈఓ అమ్రపాలి మాట్లాడుతూ, ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించటానికి బీఎల్‌ఓలదే ముఖ్య పాత్ర అని సూచించారు. ఓటరు చైతన్యంపై రూపొందించిన స్టిక్కర్లను రజత్‌కుమార్ ఆవిష్కరించిన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పాల్గొన్నారు.

మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ఆర్ట్‌స్పాట్
మెట్రో ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 20: నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ నుంచి ప్రజలకు ఊరట కలిగించటంతో పాటు చిత్రలేఖనంలో ఇపుడిపుడే రాణిస్తున్న ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు మెట్రోరైలు తనవంతు కృషి కూడా చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం మియాపూర్ మెట్రో స్టేషన్‌లో కళాకారులను, విద్యార్థులను ప్రోత్సహించేలా విశాలమైన ఆర్ట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసింది. కళాకారులు తమ చిత్రాలను గీయడంలో తగిన తర్పీదు, తమ కళా నైపుణ్యాన్ని మరింత మెరుగు దిద్దుకునేందుకు వీలుగా ఈ ఆర్ట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసినట్లు మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ ఆర్ట్‌స్పాట్‌లో కొన్ని రోజులుగా ‘అద్భుత’ పేరిట ఓ కుడ్య చిత్రలేఖన కార్యక్రమాన్ని మెట్రోరైలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జంటనగరాల్లోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా శారద విద్యామందిర్, స్టాన్‌ఫోర్డు స్కూల్, ఎంఎన్‌ఆర్ గ్రూప్‌కు చెందిన పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు మెట్రోరైలు అధికారులు తెలిపారు. ఇక్కడున్న కళాకృతులపై వారు రంగురంగుల చిత్రాలను గీసి తమ కళానైపుణ్యాన్ని చాటుకున్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంమలో పాల్గొన్న విద్యార్థులను, కళాకారులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కల్గిన విద్యార్థులు, కళాకారులు మెట్రోరైలు జీఎం బీ.యన్. రాజేశ్వర్‌ను ఫోన్ 8008456866లో సంప్రదించవచ్చునని ఎండీ సూచించారు.