హైదరాబాద్

గులాబీకి గుచ్చుకున్న ముల్లు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి చేవెళ్ళ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డి మంగళవారం పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. దీనికి జిల్లాలో ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరే కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంతర్గత వివాదానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి వివరించినా స్పందన లేకపోవడంతో ఈ మేరకు ఎంపీ కొండా విశే్వశ్వరరావు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ను జిల్లా బాధ్యతల నుండి తప్పిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది. గత ఎన్నికల్లో ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా పోటీపడ్డ ఒకే పార్టీకి చెందిన మల్‌రెడ్డి రాంరెడ్డి, క్యామ మల్లేష్ మధ్య టిక్కెట్ కోసం పోటీ కొనసాగగా చివరకు పార్టీ టిక్కెట్ క్యామ మల్లేష్‌ను వరించింది. దీనితో స్వతంత్రంగా బరిలో ఉన్న మల్‌రెడ్డి రాంరెడ్డిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేస్తూ అప్పటి పిపిసి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కథ అడ్డం తిరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇదే నియోజకవర్గం నుండి తిరిగి మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లేష్‌లు బరిలో దిగేందుకు టిక్కెట్లు ఆశించగా క్రమశిక్షణతో తనదైన శైలిలో టిక్కెట్ కోసం మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రయత్నిస్తుండగా ఇద్దరి మధ్య అధిష్టానం మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించినట్లు వివరించడంతో డిసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ తనదైన శైలిలో మీడియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతూ వివాదాస్పద ఆరోపణలు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం అతనిపై చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాధ్యతల నుంచి తొలగించిన టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి షోకాజ్ నోటీసును జారీచేశారు. 24 గంటల్లోగా దానికి సంబంధించి సమాధానం ఇవ్వకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి వస్తుందంటూ ఉత్తర్వులు జారీచేశారు. దీనితో జిల్లాలో ఈ రెండు సంఘటనలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

‘బాలల కథలు’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, నవంబర్ 20: బాలల దినోత్సవం సందర్భంగా ‘బాలల నాటికలు’ పుస్తకావిష్కరణ సభ కమలాకర లలిత కళా భారతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. బాలలకు అర్థమయ్యే రీతిలో కథలు రచించారని కీర్తించారు. కథలు చెప్పడం మరిచిపోయిన తరుణంలో కథల పుస్తకం తీసుకురావడం అభినందనీయమని అన్నారు. నృత్య కళాకారులు కుమారి శృతి బృందం ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆచార్య టీ.గౌరి శంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సులోచన, సంస్థ అధ్యక్షురాలు కమలాకర భారతి పాల్గొన్నారు.

దళితులను విస్మరించిన టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు
కాచిగూడ, నవంబర్ 20: దళితులకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో పూర్తిగా విఫలమైన టీఆర్‌ఎస్‌కి అసెంబ్లీ ఎన్నికలో తగిన గుణపాఠం తప్పదని తెలంగాణ దళిత హక్కుల పరిరక్షణ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గాలిపల్లి కృష్ణ హెచ్చరించారు. మంగళవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సీఎం దళితుడేనని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనను కేసీఆర్ చేపట్టారని మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను అణగదొక్కుతారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా మహాకుటమి అభ్యుర్థుల గెలుపు కోసం ప్రచారం చేపడతామని తెలిపారు. మహాకుటమికి తమ ఫోరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కుటమి పార్టీ అధ్యక్షులకు లేఖను అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షుడు దళిత రత్న పగిడి యాదగిరి, పన్నాసింగ్ వాల్మీకి, సత్యనారాయణ, ఆనంద్ పాల్గొన్నారు.