హైదరాబాద్

నోరి దంపతులకు జీవిత సాఫల్య పురస్కార ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 10: ఉగాది పండుగ సందర్భంగా నోరి రఘురామమూర్తి దంపతులకు వంశీ ఉగాది జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సం ఆదివారం వంశీ ఇంటర్నేషనల్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొలి సినీ నేపథ్య గాయనీ జమునారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోరి రఘురామమూర్తి, నోరి వెంకట హేమకళ్యాణి ఆదర్శ దంపతులకు వంశీ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భార్యభర్తలు ఒకరికొకరూ గౌరవించుకున్నప్పుడే వారి కుంటుంబం ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. ఆదర్శ దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సభకు ముందు నోరి వెంకట హేమకళ్యాణి ఆలపించిన భక్తి సంగీతం అందరిని అలరించాయి. ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానాశాస్ర్తీ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, ప్రపంచ రికార్డుల గ్రహీత డా.కళావేంకట దీక్షితులు, తెనే్నటి సుధాదేవి పాల్గొన్నారు.