హైదరాబాద్

‘హైదరాబాద్ విషాదం’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 10: నిజాం ప్రభుత్వం చివరి ప్రధాని మీర్‌లాయక్ అలీ రచించిన చరిత్ర పుస్తకాన్ని ప్రముఖ రచయిత డా. ఏనుగు నరసింహారెడ్డి అనువాదం చేసి ‘ హైదరాబాద్ విషాదం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. తెలంగాణ రచయిత సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పుస్తకావిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీయాల ఆకాంక్షకు బీజాలు తెలంగాణ చరిత్రలోనే ఉన్నాయనే వాస్తవాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుందని అన్నారు. తెలంగాణ చరిత్ర విశిష్టత భిన్నమైందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకంటే భిన్నమైన చరిత్ర తెలంగాణ కలిగి ఉందని తెలిపారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన విషాదం కేవలం ఇంగ్లీష్‌లోనే ఉన్నాయని కానీ ఏనుగు నరసింహారెడ్డి తెలుగులోకి అనువాదం చేయడం అభినందనీయ మన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రను యువత తెలుకోవడం ఎంతో అవసరమన్నారు. సాహిత్య సభలకు యువత పాల్గొంటే అనేక విషయాలు తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి.రమణచారి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టశేఖర్ రెడ్డి, పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ కెపి.ఆశోక్‌కుమార్ పాల్గొన్నారు.