హైదరాబాద్

సైలెంట్ పాలి’ట్రిక్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియటంతో అభ్యర్థులు.. ఓట్ల సమీకరణ కోసం రహస్య సమీకరణలు చేస్తున్నారు. రాజకీయ సందడికి బ్రేక్ పడటంతో పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్దం చేసేందుకు సైలెంట్ పాలి‘ట్రిక్స్’ ప్లే చేస్తున్నారు. ఇందులో భాగంగా గల్లీ,బస్తీ లీడర్లు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు పెద్ద మొత్తంలో చెల్లించి ఓట్లు తమకే వేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. పేదలు నివసించే మురికివాడలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న బస్తీలకు చెందిన గల్లీ లీడర్లకు భలే బేరాలు కుదురుతున్నాయి. తమకు తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశమున్న పోలింగ్ స్టేషన్ల పరిధిలోని మురికివాడల ప్రజలను, ఇతర పార్టీలకు చెందిన నేతలను కొనుగోలు చేసేందుకు అభ్యర్థులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గత నెల 12వ తేదీ నుంచి గల్లీ, గల్లీ, వీధివీధిలో మోగిన మైకులు, బ్యాండు మేళాలు, వివిధ పార్టీ నేతలు, కార్యకర్తల ఆటాపాటాకు బ్రేక్ పడింది. ప్రచారంలో జోష్ నింపేందుకు సందడి పెంచేందుకు ప్రతి ఒక్కరూ బ్యాండ్ మేళాలు, ప్రచార వాహానాల మైక్‌లలో ప్రసంగాలు, పాటాలతో హోరెత్తిన బస్తీలు, మురికివాడల గల్లీలు, వీధుల్లో ఐదు గంటల తర్వాత ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. ప్రచారం పుణ్యమాని అడ్డా కూలీలు, నిరుద్యోగులు, చిన్నా చితక పనులు చేసుకునేవారు మొదలుకుని, బ్యాండ్, డప్పు కళాకారులు, టెంట్ హౌజ్ నిర్వాహకులు, క్యాటరింగ్ మొదలుకుని సోషల్ మీడియాలో అభ్యర్థుల కోసం ప్రచారం చేసిన వారి రాజకీయ పండుగ కూడా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.
మాకు వేయకున్నా ఫర్వాలేదు
త్రిముఖ పోటీ నెలకొన్న పలు నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయపార్టీలకు ఇప్పటి నుంచే ఓటమి భయం పట్టుకుంది. మజ్లిస్‌కి ఈసారి నాంపల్లి, మలక్‌పేటలో విజయం అంత సులభమయ్యే పరిస్థితుల్లేవు. ఈక్రమంలో తమకు గట్టి పోటీనిచ్చే ప్రధాన ప్రత్యర్థికి ఓట్లు పడకుండా మజ్లిస్ ప్రతినిధులు పావులు కదుపుతోంది. ఒక వర్గం ప్రజలతో చర్చలు జరుపుతూ మీ ఓట్లు మాకు వేయకున్నా, ఫర్వాలేదు, తమ ప్రత్యర్థికి వేయరాదంటూ సూచిస్తూ కొందరు గల్లీ లీడర్లను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.