హైదరాబాద్

జగన్ కేసులో.. కీలక మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో బుధవారం కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కేంద్ర ప్రభుత్వనికి అందలేదని కేంద్ర సోలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ ఉమ్మడి హైకోర్టుకు పంపిన వౌలిక ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో నివేదిస్తే వాటిని ఆమోదించడమేకాక చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. జగన్‌పై జరిగిన కోడికత్తిదాడి అంశంపై కేంద్రం దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన కోర్టుకు వెల్లడించారు. బుధవారం నాడు ఉమ్మడి హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృషణ్, జస్టిస్ ఎస్‌వి బట్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తూ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఏపీ పోలీసుల వైఖరిని తప్పుపట్టింది. మీ పరిధిలో లేని కేసుల అంశాన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ అడ్వకేట్‌ను కోర్టు నిలదీశింది. గతంలోనే పలుమార్లు ఏపీ ప్రభుత్వానికి చూచించినా జగన్ కేసును ఎన్‌ఐఏకి ఎందుకు బదలాయించలేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంతేగాక వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 14వ తేదీలోపు ఎన్‌ఐఏకి కేసును బదిలీ చేయాలా? వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని, ఎన్‌ఐఏ దర్యాప్తు చేసి ఉంటే నిలేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చామని సీఐఎస్‌ఎఫ్ పేర్కొంది, ఏపీ ప్రభుత్వం తరుపున కేసు దర్యాప్తుపై కోర్టులో ఏపీ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ కేసు సెక్షన్ (3) కిందకిరాదని ఏజీ తెలిపారు. ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.