హైదరాబాద్

భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతిభద్రతల పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఒకరి చొప్పున 15 మంది అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ)లను నోడల్ అధికారులుగా నియమించామని చెప్పారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంజనీ కుమార్ తోటి అదనపు పోలీసు కమిషనర్లు షీకాగోయాల్, టీ.మురళీకృష్ణ, అనిమ్ కుమార్, తరుణ్ జోషీ, శివప్రసాద్‌తో కలిసి మాట్లాడారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వాహనాల తనిఖీలో రూ.72.03కోట్లు పట్టుకున్నామని, రూ.2.41కోట్లు విలువ చేసే బంగారం, వెండి అభరణాలను సీజ్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు లక్ష 63491 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసిన్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు, నగర పోలీసులతో కలిపి దాదాపు 17వేల మందితో బందోబస్తును ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థుల కదలికలపై ప్రత్యేక నిఘాను ఉంచామని, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును ముమ్మరం చేశామని చెప్పారు. ఎన్నికల నియమవళికి అనుకూలంగా ఆయుధాల డిపాజిట్ విషయంలో ఆర్మీ సీనియర్ అధికారులకు, అంతర్జాతీయ షూటర్ గగాన్ నారంగ్‌తో పాటు రైఫిల్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు పలువురు షూటింగ్ క్రీడాకారులకు వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ఫ్లాగ్ మార్చ్, కార్డన్ సెర్చ్‌లు నిర్వహించామని, ప్రతి నియోజకవర్గంలో మూడు స్టాటిక్ సర్వేలెన్స్, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు రౌండ్ ది క్లాక్ పనిచేస్తాయని తెలిపారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3911 పోలీంగ్ కేంద్రాలు 1574 ప్రాంతాల్లో ఉన్నాయని, వీటి వద్ద భద్రతను రెట్టింపు చేయడంతో పాటు స్థానిక పోలీసులతో పికెట్‌లను సైతం ఏర్పాటు చేశామని అన్నారు. కింది స్థాయి అధికారి నుంచి అదనపు సీపీ స్థాయి అధికారి వరకు ఎన్నికల పోలింగ్ రోజు బందోబస్తులో పాల్గొని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. చిన్నాపాటి గొడవ జరిగినా క్షణాల్లో పోలీసులు చేరుకునే ఏర్పాటు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు పదివేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా మొత్తం 2.40లక్షల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొద్దిపాటి గొడవ జరిగినా వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్లు అనుమతించామని చెప్పా రు. 15 నియోజకవర్గాలకు సంబంధించి వాహనాల తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని అంజనీ కుమార్ తెలిపారు.