హైదరాబాద్

ఉత్కంఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: మహానగర పాలక సంస్థ ఎన్నికల సందడి మరింత ఊపందుకుంది. ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి అధికారులు వివిధ రకాల ఏర్పాట్లను చేసి సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో భాగంగా నేడో, రేపో సర్కారు డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. కానీ అధికారులు రిజర్వేషన్ల ప్రతిపాదనలు సర్కారుకు పంపిన మూడు, నాలుగు రోజుల నుంచి ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై అశావహులు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ ఎన్నికల సందడిలో మునిగి తేలుతున్నారు. గోషామహల్‌లో తెరాసకు చెందిన కొందరు, ముషీరాబాద్‌లో టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన మరికొందరు నేతలు ఈ రకంగా హడావుడి చేస్తున్నారు. మరో వైపు వివిధ రాజకీయపార్టీలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మురం చేశాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ఇప్పటికే గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనకొస్తే పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేధాలు ఇంకా సద్దుమణగనేలేదు. నిన్నమొన్నటి వరకు గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ తెరాసలో చేరుతున్నారన్న పుకార్లు షికారు చేస్తూ, రాష్ట్ర స్థాయి నేతలు మొదలుకుని సామాన్య కార్యకర్త వరకు చర్చనీయాంశంగా మారింది. ఆ విషయం కాస్త ఇపుడు సద్దుమణిగింది, ఇక పార్టీ విషయం ఆలోచిద్దామనే సమయానికి గ్రేటర్ మాజీ మేయర్ బండకార్తీక చంద్రారెడ్డికి కోపమొచ్చింది. గ్రేటర్ ఎన్నికల విషయాన్ని పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు వెళ్లిన నేతలు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని, గ్రేటర్ ఎన్నికల్లో కావాలనే తనను ముందు నుంచి పక్కనబెడుతున్నారంటూ ఆమె సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అన్ని పార్టీలకు చెందిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలు సఖ్యతతో పనిచేస్తే తప్ప, మెరుగైన ఫలితాలను సాధించలేరు. కానీ మజ్లిస్ పార్టీ మినహా మిగలిన అన్ని పార్టీల్లోనూ ఈ రెండు జిల్లాలకు చెందిన నేతల పరిస్థితి ఎడముఖం పెడముఖం అన్నట్టుగానే తయారైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉభయ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బిజెపి, టిడిపి పార్టీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. రెండు జిల్లాల నేతల మధ్య సమన్వయం కరవైంది. గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ వ్యవహారంపై ఇప్పటికే పలువురు తెలుగు తమ్ముళ్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు చేశారు. విపక్షాల పరిస్థితి ఇలా ఉంటే, అధికార పార్టీ తెరాస ధోరణి భిన్నంగా ఉంది. అసలు గ్రేటర్‌లో క్యాడర్ లేని ఈ పార్టీ సొంతంగా సర్వేలు చేయించుకుంటూ, ఇతర పార్టీల్లో మంచి నాయకత్వపు లక్షణాలున్న నేతలను పార్టీలో చేర్చుకోవటంలో సఫలం చెందుతూ, చాపకింద నీరులా అల్లుకుపోతోంది.