హైదరాబాద్

కలెక్టరేట్‌లో ప్రజావాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను వెంటనే పరిశీలించి సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జేసి తెలిపారు. ప్రజావాణిలో భూసమస్యలు, పెన్షన్లు, రుణ మంజూరు, ఆర్థిక సహాయం తదితర అంశాలపై 88 దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి, జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి, జడ్పీ సిఇఒ రమాణారెడ్డి, డిఆర్‌డిఎ పిడి సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పిడి హరిత పాల్గొన్నారు.

సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్, ఏప్రిల్ 11: శ్రీరామ భక్త సమాజము ఆధ్వర్యంలో 80వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. నాంపల్లిలోని గూడ్స్‌గేటు వద్దనున్న శ్రీ రామ హనుమాన్ మందిరం ఆవరణలో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా ఉదయం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు ‘శివపూజ మహిళ’ హరికథ కార్యక్రమాన్ని నిర్వహించారు. 12వ తేదీన మంగళవారం ఉదయం పది గంటలకు దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద సువాసినులు, కన్యలచే లలితా సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వేంకటచలపతిరావు తెలిపారు. ఈనెల 15వ తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకని 14వ తేదీ గురువారం ఉదయం పది గంటలకు వివాహమునకు సంబంధించి పసుపు కొమ్ములను దంచే వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి ఎనిమిది గంటలకు ‘ఎదురుకోలు ఉత్సవము’ ఆ తర్వాత శ్రీ సీతారాముల గుణ ప్రసంశ, కల్యాణ నిశ్చితార్ద ప్రసంగములుంటాయని తెలిపారు. కార్యక్రమానికి ముదిగొండ శివప్రసాదు, కాకునూరి సూర్యనారాయణ, అక్కిరాజు రామకృష్ణ, కుప్పా కృష్ణమూర్తి, పప్పు నాగేశ్వరరావు, వసంత లక్ష్మిలు అతిథులుగా పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక వేదిక వద్ధ గణపతి పూజ, పుణ్యాహవాచనము కార్యక్రమాలు, పదిన్నర నుంచి పనె్నండు గంటల వకరు సీతారాముల కల్యాణము, తలంబ్రాలు ఆ తర్వాత సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు పూల పల్లకిలో కల్యాణ దంపతుల ఊరేగింపు, అనంతరం చెండ్లాడింపు, మేజువాణి కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
కల్యాణం మరుసటి రోజైన 16వ తేదీ శనివారం ఉదయం పది గంటలకు శ్రీ రామ పట్ట్భాషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడున్నర గంటలకు శ్రీ సీతారాములను శే్వతాశ్వ రథములో ఊరేగించుట, పదిన్నర గంటలకు పవళింపు సేవ, దంపతీ తాంబూలం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో చివరి రోజైన 18వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు కలశోద్యాసన, ద్వాదశిపారణ కార్యక్రమాలను, ఆ తర్వాత అన్నదాన కార్యఅకమాల నిర్వహణతో ఉత్సవాలు ముగించనున్నట్లు నిర్వాహకులు వేంకటచలపతి రావు తెలిపారు.