హైదరాబాద్

ఎన్ని ఓట్లొస్తాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ బూత్‌ల్లో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయన్న విషయంపై లెక్కలు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రాజకీయపార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, మజ్ల్లిస్ పార్టీలకు చెందిన సుమారు 60 నుంచి 70 మంది అభ్యర్థులు ఎవరికివారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులు నియమించుకున్న పోలింగ్ ఏజెంట్లు తమ బూత్‌లో మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల సమాచారాన్ని ఇప్పటికే అభ్యర్థులకు అందజేశారు. దానిపై ఏ బూత్‌లో తమకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ప్రత్యర్థులకు పడాల్సిన ఓట్లను ఎంత వరకు తమవైపు మలుపుకున్నామన్న విషయాలపై అభ్యర్థులు ఎవరికివారే అంచనాలు వేస్తున్నారు. ఏ బూత్‌లోనైనా తమకు అనుకూలంగా ఓట్లు తగ్గినట్టు తమ లెక్కల్లో తెలితే కొందరు అభ్యర్థులు ఆ ప్రాంతానికి చెందిన ఆయా పార్టీల నేతలను పిలిచి ఎందుకిలా జరిగిందని ప్రశ్నిస్తున్నారు. తమ లెక్కల్లో తేడా వస్తే, తమకు ఓట్లు వేయిస్తామంటూ పెద్ద మొత్తంనగరంలోని ఈ సారి అత్యధికంగా 57 శాతం, అత్యల్పంగా 44.02 శాతం నాంపల్లి నియోజకవర్గంలో ఓట్లు పోలు కావటంతో విజయం ఎవర్ని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్‌తో పాటు పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే నివేదికలపై కూడా నగరవాసుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత 2014 ఎన్నికల్లో నగరంలో 53 శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా, ఈ సారి 2.1శాతం తగ్గినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే! ఈ సారి ఒకటి రెండు స్థానాలు మినహా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండటం, దానికి తోడు పోలింగ్ శాతం తగ్గటం వంటి పరిణామాలతో ఫలితాలెలా ఉండబోతున్నాయన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు. మజ్లీస్‌కు ఈ సారి సీట్లు తగ్గుతాయి? బీజేపీకి పెరుగుతాయి? గత ఎన్నికల్లో నగరంలో కేవలం సికిందరాబాద్ ఒక్క స్థానం నుంచే గెలిచిన టీఆర్‌ఎస్ ఈ సారి ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? మహాకూటమి అభ్యర్థులు ఎక్కడెక్కడ విజయం సాధిస్తారన్న విషయంపై రాజకీయ వర్గాలు మొదలుకుని సామాన్యుల్లో కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. విజయం ఎవర్నీ వరిస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే 11న మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిందే!