హైదరాబాద్

పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఏప్రిల్ 11: పార్లమెంటులో బిసి బిల్లు ప్రవెశపెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఇందిరాపార్కు వద్ద వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అన్ని పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇరు తెలుగు ప్రభుత్వాలు కూడా అఖిల పక్షాలతో ప్రతినిధి బృందం ఏర్పరిచి ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపి, తెలంగాణ శాసనసభలలో, చట్టసభలలో బిసిలకు రిజరేషన్లు పెట్టాలని తీర్మానం చేశారు. ఈసందర్భంగా కెసిఆర్, చంద్రబాబు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరపాలని కోరారు. పార్లమెంటులో 26 బిసి రాజకీయ పార్టీలు ఉన్నా, ఏ ఒక్క పార్టీ కూడా పార్లమెంటులో బిసిల పక్షాన మాట్లాడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సమస్యలు పార్లమెంటులో చర్చకు వస్తున్నా బిసిల సమస్యల గూర్చి మాట్లాడటం లేదని అన్నారు. బిసిలకు చట్టసభలలో జనాభాప్రకారం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో వాటా కల్పించిననాడే నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో బిసి జాతీయ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్ నీలం వెంకటేష్, రావల్‌కోల్ నరేష్, బెల్లం మాధవి దుర్గయ్య గౌడ్, వినయ్, గొరిగె మల్లేష్, రామకృష్ణ, రాచమల్ల శ్రీనివాస్, పార్వతి, రాంబాబు, గజేందర్, కుల్కచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సహృదయంతో కలిసి నడవాలి
హైదరాబాద్, ఏప్రిల్ 11: జ్యోతిబాపూలే జయంతి వేడుకలు సోమవారం రవీంద్రభారతిలో జరిగాయి. విశిష్ట అతిథిగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం తలపెట్టిన పథకాలు, చేయాల్సిన సహాయం తప్పకుండా చేస్తుందని, కానీ మీరేం చేస్తున్నారని సభాముఖంగా బిసిలను ప్రశ్నించారు. మీరుండే కాలనీలో పూలే ఫొటోకు ఎంతమంది పూలమాల వేసి జయంతి జరుపుకున్నారని అన్నారు. లారీల్లోను, బస్సుల్లోను రవీంద్రభారతికి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం మానుకుని ఒకరికొకరు సహాయం చేసుకోండి.. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందని చెప్పారు. అందరూ కలిసి ఒక్క తాటిపైకి వచ్చి కుచ్చిత మనస్తత్వాన్ని వదలి సహృదయంతో కలిసి నడవండి.. పూలే చేసిన పనులు మీరు చేయ్యండని గౌడ్ అన్నారు. పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జయంతిలో ప్రత్యేక అతిథి, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, బిసిల సమస్యలను, కల్యాణలక్ష్మి పథకం అమలు విషయం సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వ అధికారులు సంచార జాతుల నివాసానికి వెళ్లి చదువు చెప్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహం మాదిరి పూలే విగ్రహ స్థాపన, ప్రత్యేక ఆడిటోరియం గురించి సిఎంకు తెలుపుతానని, సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బిసిలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, మే 13న భగీరథ కార్యక్రమాన్ని అధికారికంగా జరుపుదామని మంత్రి రామన్న అన్నారు. ఎంపి వి.హనుమంతరావు మాట్లాడుతూ చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ కల్పించాలని, సాంస్కృతిక సారధిలో బిసి కళాకారులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ దొరతనాన్ని ఎదిరించిన తొలి నేత పూలే అన్నారు. గ్రామాల్లోని బిసి పిల్లలను చదువుకోమని చెప్పాలని, చట్టసభల్లో బిసిలకు రావలసిన వాటా కల్పించాలని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్‌లు కల్పించాలని, ఫెడరేషన్ వ్యక్తిగత రుణ సదుపాయం కల్పించాలని కృష్ణయ్య అన్నారు. సంఘం చైర్‌పర్సన్ చక్రహరి రామరాజు మాట్లాడుతూ సావిత్రి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినంగా జరపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపి కేశవరావు, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రామలక్ష్మణ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ పాల్గొన్నారు.