హైదరాబాద్

అలరించిన ‘మధుర భావాల సుమమాల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: పద్మశ్రీ ఘంటసాల 96వ జయంతి సందర్భంగా ‘మధురభావాల సమమాల’ పేరిట సినీ సంగీత విభావరి కార్యక్రమం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శారద మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభ నిర్వహించారు. కార్యక్రమానికి వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, గాయకుడు త్రినాథరావు పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ఘంటసాల జయంతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ గాయనీ శారద నిర్వహణలో గాయనీ, గాయకులు సీ.రమణ, దమయంతి, వేణుగోపాల్, కే.మోహన్, వేమూరి మణి, రామలక్ష్మీ, మెలోడి సుధా, విమల అలపించిన గీతాలు అలరించాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమాభారతి
కాచిగూడ, డిసెంబర్ 8: బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమాభారతి కోసూరి అని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ పీ.విజయబాబు అన్నారు. ప్రముఖ రచయిత్రి, నర్తకి ఉమాభారతి కోసూరి ‘సాహితీ మహోత్సవం’ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయబాబు మాట్లాడుతూ, ఉమాభారతి నర్తకి, సినీ నటిగానే కాకుండా రచయిత్రిగా రాణించడం అభినందనీయమని అన్నారు. ఉమాభారతి రచించిన పుస్తకాలను సమీక్షించారు. ప్రముఖ నృత్య గురువు వాణిరమణ శిష్య బృందం ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్ద న మూర్తి, విహంగ మాస పత్రిక సంపాదకురాలు డా.పుట్ల హేమల త, ప్రొఫెసర్ డా.కే.విద్యావతి, రచయిత్రులు స్వాతి శ్రీపాద, డా.కేతవరపు రాజశ్రీ, నృత్య కినె్నర డైరెక్టర్ డా.మద్దాళి ఉషాగాయత్రి, వంశీ అధ్యక్షురాలు డా. సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.