హైదరాబాద్

అలరించిన సినీ సంగీత విభావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు డా.వాసుదేవ రెడ్డి నిర్వహణలో ‘పాడనా వాణి కళ్యాణిగా’ పేరిట సినీ సంగీత విభావరి ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి కార్డియాలజిస్ట్ డాక్లర్ దయాసాగర్ రావు, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కారించారు. గాయనీ, గాయకులు గీతాంజలి, అఖిల, లలిత, రాధిక, సుజారమణ, డా. ఉమాకాంత్, అన్నూ అలపించిన సినీ గీతాలు అలరించాయి.
గిల్గిట్‌లో మానవ హక్కుల ఉల్లంఘన
కాచిగూడ, డిసెంబర్ 9: భారతదేశంలో అంతర్గతమైన జమ్మూ కశ్మీర్‌లోని కొంత భూభాగంతో పాటు పాకిస్తాన్ ఆక్రమణలో వస్తున్న గిల్గిట్ - బాల్టిస్టాన్ ప్రజలు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారని పలువురు వక్తలు అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన 70వ వార్షికోత్సవ వేడుకలు సోషల్ కాజ్ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ లా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు మాజీ నాయ్యమూర్తి జస్టిస్ పీ.రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. గిల్గిట్ ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా స్థానిక ప్రజలు దారుణమైన పేదరికంలో నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విద్య, వైద్యం వంటి సధుపాయాలు కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పటికీ పాకిస్తాన్ అక్కడి నుంచి వైదొలగకుండా తమ ఆధీనంలో ఉంచుకుందని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ లా ఆచార్యులు డా.బీజీ రెడ్డి మాట్లాడుతూ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌తో పాటు గిల్గిట్ బాల్లిస్టాన్‌లో పాకిస్తాన్ దారుణమైన మానవ హక్కులకు పాల్పడుతుందని, ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తున్న నివేదికలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా పక్షపాత ధోరణి వ్యవహారిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ రాకా సుధాకర రావు, డా.టీ.విజయ భాస్కర్ రెడ్డి, సాయి రెడ్డి, మన్మోహన్ గోవర్తి పాల్గొని ప్రసంగించారు.