హైదరాబాద్

సుప్రసిద్ధ సంగీత కళాకారుడు కేవీ మహదేవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: సుప్రసిద్ధ సంగీత కళాకారుడు కేవీ మహదేవన్ అని రాజ్యసభ సభ్యుడు డా.టీ.సుబ్బరామి రెడ్డి అన్నారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి, ఎంఎం కీరవాణికి ‘కేవీ మహదేవన్ - వంశీ’ జీవిత సాఫల్య పురస్కారాలతో పాటు పద్మభూషణ్ డా.పీ.సుశీలకు సంగీత పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుబ్బరామి రెడ్డి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈశ్వరత్వాన్ని పొందలంటే సంగీతంలో రాణించాలని అన్నారు. సంగీత రంగంలో భారతీయ స్వరకర్తగా మహదేవన్ గుర్తింపు పొందరని తెలిపారు. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళంతో వివిధ భాషాలలో సంగీతం అందించిన గొప్పవ్యక్తి అని కీర్తించారు. సంగీత దర్శకుడిగా మూడు నంది అవార్డులను దక్కించుకున్నారని పేర్కొన్నారు. ప్రముఖ గాయనీ శారద ఆకునూరి నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన కేవీ మహదేవన్ సినీ సంగీత విభావరి అలరించాయి. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రజానటి జమున, సినీ నిర్మాత వైవీఎస్ చౌదరి, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్, కొమ్మారెడ్డి, సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, సంస్థ అధ్యక్షురాలు డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.

‘ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు ప్రదానం
కాచిగూడ, డిసెంబర్ 10: శిఖరం ఆర్ట్ థియేటర్స్, వీ3 న్యూస్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి ‘ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ కమిషన్ చైర్మెన్ బీ ఎస్ రాములు పాల్గొని ఐకాన్ అవార్డులతో పాటు డా.లయన్ విజయ్ కుమార్‌కు ‘కళశ్రీ’ పురస్కారం ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి వారిని అయా రంగాల్లో ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ గాయనీ, గాయకుడు తాడూరి అంజి, సాయి పావని నిర్వహణలో సినీ సంగీత విభావరి అలరించాయి. కాచం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వై ఎస్ ఆర్ మూర్తి, సామాజిక వేత్త డా.కొత్తకృష్ణవేణి, నిర్మాత మహ్మద్ రఫీ, సంస్థ అధ్యక్షుడు జీ.కృష్ణ పాల్గొన్నారు.