హైదరాబాద్

ఖైరతాబాద్ పీఠం ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ పీఠం ఎవరిని వరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. టీఆర్‌ఎస్ రాష్టవ్య్రాప్తంగా అభ్యర్ధులను ప్రకటించినా ఖైరతాబాద్ విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. నియోజకవర్గం నుంచి ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులు భరిలో నిలవగా మొత్తం 34 మంది పోటీ చేసారు. మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి దాసోజు శ్రవణ్, టీఆర్‌ఎస్ నుంచి మాజీ దానం నాగేందర్, భారతీయ జనతా పార్టీ నుంచి తాజా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేసారు. అభ్యర్ధుల గెలుపోటములను బీఎస్‌పీ అభ్యర్ధి మనె్న గోవర్ధన్ రెడ్డి ప్రభావితం చేయనున్నారు. నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ జరిగినప్పటికీ మూడు పార్టీల మధ్యే పోటీ నడిచింది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోన తీవ్రస్థాయిలో మదన పడుతున్నారు. మహాకూటమి అభ్యర్థి దాసోజు కాంగ్రెస్ ఓట్లతో పాటు టీడీపీ ఓట్లు, మైనారిటీ ఓట్లు తనకు విజయం చేకూరుస్తాయని భావిస్తుండగా, చింతల తాను చేసిన సేవా కార్యక్రమాలు, మహిళా ఓట్లు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మాజీ మంత్రి దానం నాగేందర్.. టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో తీర్పును ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల వారీగా పోలింగ్ సరళిని అంచనా వేసుకుంటున్నారు. దీంతో ఈవీఎంలు తెరిచే క్షణాల కోసం అభ్యర్ధులతో పాటు నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.