హైదరాబాద్

గులాబీ పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ఖైరతాబాద్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కంటోనె్మంట్ నియోజకవర్గాల్లో పాగా వేసింది. ముఖ్యంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కంటోనె్మంట్ నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకులు దానం నాగేందర్, ముఠాగోపాల్, మాగంటి గోపీనాధ్, తలసాని శ్రీనివాసయాదవ్, జి. సాయన్న పోటీ చేయటం, కేసీఆర్ ప్రచారం, వ్యూహం ఫలించి ఆ పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధించిందని చెప్పవచ్చు. 2014లో ఎన్నికల్లో ఒక్క సికిందరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి టీ.పద్మారావు ఇపుడు తాజాగా రెండోసారి కూడా విజయకేతనం ఎగురవేశారు. తాజాగా టీఆర్‌ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఆరింటిలో కొత్తగా ఆ పార్టీ పాగా వేసింది. ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్ గడిచిన మూడు దశాబ్దాలుగా అదే నియోజకవర్గంలో టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీ నేతగా కీయాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలైన ‘ముఠా’ మూడు దశాబ్దాల కల ఈసారి నెరవేరింది.
ముషీరాబాద్ నియోజవర్గంలో సీట్ల పొత్తులో భాగంగా గడిచిన 20 ఏళ్ల నుంచి టీడీపీ పార్టీ ఏ అభ్యర్థికి మద్దతునిస్తే ఆ పార్టీ గెలుపు సాధిస్తూ వస్తోంది. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రజాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా అనీల్‌కుమార్ యాదవ్ బరిలో నిలిచినా, ముఠాగోపాల్ అనూహ్యంగా విజయం సాధించారు. ఇక అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొట్టమొదటి సారిగా పోటీ చేసిన కాలేరు వెంకటేశ్‌ను అదృష్టం వరించింది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కిషన్‌రెడ్డి గెలిచే అవకాశాలెక్కువగా ఉన్నట్లు రాజకీయంగా విశే్లషణలున్నా, ఫలితాల్లో అవన్నీ తలకిందులై కా(లే)రు స్పీడుకు కమలం వాడింది. గతంలో కార్పొరేటర్‌గా వ్యవహరించిన కాలేరు వెంకటేశ్, మూడు దశాబ్దాలుగా అవకాశం ఎదురుచూస్తున్న ముఠాగోపాల్‌లు ఈ ఎన్నికల్లో గెలుపొంది మొదటి సారిగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.
విజేతలు వీరే
8 ఓట్ల లెక్కింపులో మొట్టమొదటగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఫలితాన్ని ప్రకటించారు. మజ్లీస్ అభ్యర్థి అక్బరుద్దిన్ ఓవైసీ తమ సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి షెహజాది సయ్యద్‌పై 80వేల 263 ఓట్లతో విజయం సాధించారు.
8 బహద్దూర్‌పురాలో మజ్లీస్ అభ్యర్థి వౌజంఖాన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయ త్ అలీ బాక్రీపై 82వేల 518 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
8 అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ 1016 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
8 కంటోనె్మంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జి. సాయన్న కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 36వేల 566 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
8 సనత్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాసయాదవ్ మొత్తం 66వేల 464 ఓట్లను సాధించి, టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్‌పై 30వేల 217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
8 మలక్‌పేటలో మజ్లీస్ అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా టీడీపీ అభ్యర్థి ముజాఫర్ అలీ(టీడీపీ)పై 23వేల 515 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
8 సికిందరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌పై 41వేల 141 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
8 కార్వాన్‌లో మజ్లీస్ అభ్యర్థి కౌసర్ మొహియుద్దిన్ బీజేపీ అభ్యర్థి టీ. అమర్‌సింగ్‌పై 49వేల 692 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
8 ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ ప్రజాకూటమి అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్‌పై 36వేల 888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
8 ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28వేల 348 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
8 నాంపల్లిలో మజ్లీస్ అభ్యర్థి మెరాజ్ జాఫర్‌హుస్సేన్ తమ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌పై 9675 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
8 యాకుత్‌పురాలో మజ్లీస్ అభ్యర్థి మహ్మద్ పాషాఖాద్రి టీఆర్‌ఎస్ అభ్యర్థి సామ సుందర్‌రెడ్డిపై 42వేల 226 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
8 చార్మినార్‌లో మజ్లీస్ అభ్యర్థి ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఉమా మహేంద్రపై 32వేల 586 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
8 గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి టీ. రాజాసింగ్ తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై 17వేల 578 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
8 జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్దన్ రెడ్డిపై 16,614 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.